ఇండస్ట్రీ పెద్దగా సినీ పరిశ్రమకు మెగాస్టార్ చిరంజీవి పలు సూచనలు, సలహాలు ఇస్తుంటారు. ఎలా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుందో అనేది సినిమా సభ్యులతో పంచుకుంటూ ఉంటారు. ఇండస్ట్రీ కష్టాల్లో ఉన్నప్పుడు అన్నీ తానే అయ్యి తన భుజాల మీద నడిపించి సమస్యకి పరిష్కారం చూపిస్తారు. అలాంటి మెగాస్టార్ తాజాగా తెలుగు సినిమా దర్శకులకి కొన్ని సలహాలు, సూచనలు ఇచ్చారు. లాల్‌సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆయన నటులు ఎదుర్కునే సమస్యల గురించి ప్రస్తావించారు. స్క్రిప్ట్ విషయంలో డైరెక్టర్లు మరింత శ్రమించాలని చిరంజీవి అన్నారు. కొందరు డైరెక్టర్లు షూటింగ్ స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగులు ఇస్తున్నారని, దీని వల్ల నటులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను కూడా చాలా సందర్భాల్లో ఇబ్బందులు పడ్డానని వెల్లడించారు. స్పాట్‌లో అప్పటికప్పుడు డైలాగులు రాయడం వల్ల డైలాగులు చదవడానికే సమయం సరిపోతుందని, ఇక నటనపై దృష్టి ఎలా పెడతామని ఆయన ప్రశ్నించారు.
దర్శకులు తమ తీరు మార్చుకోవాలని, నటులకి ముందుగానే స్క్రిప్ట్ ఇవ్వాలని సూచించారు. అలానే సినిమా సెట్స్‌పైకి వెళ్ళే ముందు వర్క్ షాప్స్ నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. ఈ వర్క్ షాప్స్ వల్ల నటులకి డైలాగులు నేర్చుకోవడంతో పాటు, నటనపై దృష్టి సారించే అవకాశం ఉంటుందని అన్నారు. ఇలాంటి వర్క్ షాప్స్ వల్ల షూటింగ్ సమయంలో డైలాగులు మర్చిపోయే ఛాన్స్ ఉండదని, ప్రాంప్ట్ చేయమని ఎవరిని అడగాల్సిన పని ఉండదని, చాలా సమయం సేవ్ అవుతుందని అన్నారు. దర్శకులు ముందుగానే స్క్రిప్ట్‌ని లాక్ చేసి.. నటులకి, టెక్నీషియన్స్‌కి పూర్తి అవగాహన కల్పించగలిగితే వంద శాతం అవుట్‌పుట్ బాగా వస్తుందని అన్నారు. ఈ విషయంలో బాలీవుడ్ దర్శకులని చూసి నేర్చుకోవాలని అన్నారు. దీనిపై మన దర్శకులు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి. మరి చిరు వ్యాఖ్యలపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
ఇది కూడా చదవండి: Income Tax Department: ఇండియాలోనే హైయ్యెస్ట్ ట్యాక్స్ కట్టే స్టార్ హీరో ఎవరంటే?
ఇది కూడా చదవండి: Dhanush: ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ విడాకులు.. ఆ హీరోయినే కారణమంటున్న నెటిజన్లు.