తెలుగు సినిమా అభిమానులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 29న విడుదల కానుంది. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి, రామ్ చరణ్ స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇది. అంతేకాకుండా సిద్ధాగా చాలా పవర్ ఫుల్ పాత్రలో రామ్ చరణ్ కనిపించనున్నాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తేనే అర్థమవుతుంది.. ప్రేక్షకుల్లో ఈ సినిమాకి ఎంత క్రేజ్ ఉందనేది. ఏరియా, లాంగ్వేజ్ వారీగా ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఏ విధంగా జరిగిందో చూద్దాం.
ఆచార్య ప్రీ రిలీజ్ బిజినెస్
నైజాం 38 కోట్లు
సీడెడ్ 18.50 కోట్లు
ఉత్తరాంధ్ర 13 కోట్లు
ఈస్ట్ 9.5 కోట్లు
వెస్ట్ 7.20 కోట్లు
గుంటూరు 9 కోట్లు
కృష్ణా 8 కోట్లు
నెల్లూరు 4.30 కోట్లు
ఏపీ- తెలంగాణ టోటల్: 107.50 కోట్లు
కర్ణాటక 9 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా 2.70 కోట్లు
ఓవర్సీస్ 12 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ టోటల్: 131.20 కోట్లు
ఆచార్య సినిమాకి వరల్డ్ వైడ్ గా 131.20 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించాలంటే దాదాపు 132.50 కోట్లు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓవైపు మెగాస్టార్, మరోవైపు మెగా పవర్ స్టార్ ఉండగా కలెక్షన్స్ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆచార్య సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.