యాంకర్ సుమకు బుల్లితెరపై సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వెండితరెపై హీరోలకు ఎంత ఫాలోయింగ్ ఉంటుందో.. సుమ ఫాలోయింగ్ కూడా అందుకు ఏమాత్రం తగ్గదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అగ్ర హీరో నుంచి అప్ కమింగ్ హీరోదాకా ఎలాంటి సినిమా ఈవెంట్ ఉన్నా యాంకరింగ్ కు సుమానే కావాలి అంటారు. ఎందుకంటే ఆమె సమయస్ఫూర్తి, వాగ్దాటి అలాంటింది. సుమ యాంకరింగ్ కు సాదాసీదా వాళ్లే కాదు.. మెగాస్టార్ చిరంజీవి కూడా పెద్ద ఫ్యానే. ఆ విషయాన్ని ఆయనే స్వయంగా స్టేజ్ పై చెప్పారు.
ఇదీ చదవండి: తాప్సిపై మెగాస్టార్ చిరు క్రేజీ కామెంట్స్.. వైరల్ వీడియో!
స్వరూప్ RSJ దర్శకత్వంలో తెరకెక్కిన ‘మిషన్ ఇంపాజిబుల్’. ఈ సినిమాలో తాప్సి ప్రధాన పాత్ర పోషించింది. ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న ఈ సినిమాను మాట్నీ అండ్ పిఏ ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్లపై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి.. సుమ యాంకరింగ్ పై ప్రశంసలు కురిపించారు. ‘ఈ ఈవెంట్ ఇంత బాగా వచ్చిందంటే అందుకు సుమానే కారణం. ఆమె వాగ్దాటి ఎంతో బావుటుంది. నాకు ఎంతో మంది ఫ్యాన్స్ ఉండచ్చు. నేను కూడా కొందరికి ఫ్యాన్ కావచ్చు. నేను కూడా సుమ యాంకరింగ్ కు పెద్ద ఫ్యాన్’ అంటూ చిరు తెలియజేశారు. చిరంజీవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.