ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆచార్య’. ఈ నెల 29న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో తండ్రీ కొడుకులు పోటీ పడి నటించబోతున్నారని విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ తెగ సంబరాలు చేసుకుంటున్నారట. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ ప్రమోషన్ బిజీలో ఉన్నారు. ఆచార్య మూవీ ప్రమోషన్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖకు సంబంధించిన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఒకే మూవీలో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి నటించాలనేది సురేఖ కొణిదెల బలమైన కోరిక.. మొత్తానికి ఆమె కోరిక ఇన్నాళ్లకు తీరబోతుంది. ఈ సందర్భంగా చిరజీవి మాట్లాడుతూ.. తండ్రీ కొడుకులం ఒకే సందర్భంలో కనిపిస్తే చూడాలనేది సురేఖ సంకల్పం. మన కోరికలు, సంకల్పం బలంగా ఉంటే.. అవి తప్పకుండా నెరవేరుతాయి అన్నారు. ఇక రామ్ చరణ్ తన తల్లి గురించి మాట్లాడుతూ.. అమ్మ ఏది అనుకున్నా అది జరిగిపోతుంది.. ఆమె మనసు చాలా మంచిది.. వాస్తవానికి నాన్నా, నేనూ ఇద్దరం కలిసి ఇప్పుడే నటించొద్దు అని అనుకున్నా కూడా ఎలాగోలా జరిగిపోయిందని అన్నారు రామ్ చరణ్.
తన తనయుడు రామ్ చరణ్ చెప్పిన తర్వాత చిరంజీవి మాట్లాడుతూ.. తన పెళ్లినాటి విషయం చెప్పారు. సురేఖ ఏది కోరుకుంటే అది టక్కున జరిగిపోతుందని ఇది ఆమె జీవితంలో ఎన్నో సార్లు జరిగింది. తాను కెరీర్ లో స్థిరపడ్డ తర్వాత పెళ్లి చేసుకుందాం అని అనుకున్నారు. కానీ మనవూరి పాండవులు సినిమా చూసి.. ఈ సైకిల్ అబ్బాయి భలే ఉన్నాడు ఈయనే నా భర్త కావాలని బలంగా కోరుకుందట.. అంతే ఆమెను పెళ్లి చేసుకున్నా. ఆవిడ కోరిక అంత బలీయమైంది.. అంటూ నవ్వేశారు. ఇక వెండితెరపై తమ అభిమాన హీరోలు ఒకేసారి కనిపించబోతున్నందుకు మెగా ఫ్యాన్స్ తో పాటు, ప్రేక్షకుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి.