మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘‘వాల్తేరు వీరయ్య’’ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఇక, ఈ సినిమా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సినిమా టీం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. మెగాస్టార్ కూడా పలు ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నారు. ఆయన తాజాగా, ప్రముఖ డిజిటల్ మీడియా అయిన సుమన్ టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో జర్నలిస్ట్ ప్రభు అడిగిన పలు ప్రశ్నలపై ఆయన మాట్లాడారు. తన రాజకీయ భవిష్యత్తుతో పాటు పవన్ కల్యాణ్‌కు మద్దతుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ రాజకీయంగా సపోర్టు తీసుకోవాల్సి అవసరం పవన్‌కు లేదు. అలాంటి పరిస్థితి రాదు.. రాకూడదు. అలాంటి పరిస్థితి వస్తే గనుక.. తమ్ముడు అనుకున్నది అవ్వాలనుకుంటాను తప్ప నేను మాత్రం పొలిటికల్‌గా ఎలాంటి ఇది నాకు లేదు.
నా ప్రమేయం ఉండదు. తమ్ముడికి కూడా మా ప్రమేయం అవసరం లేదు. మా సపోర్టు కల్యాణ్ బాబు కోరుకోడు. మీరు మీ ప్రొఫెషన్ విషయంలో దృష్టిపెట్టండి. ఈ ఒక్క విషయంలో నేను ఒంటరిగా వెళతాను. నా వల్ల డిస్ట్రబ్ అవ్వద్దు.. నాకు సపోర్ట్ చేయాలని మీ ప్రొఫెషన్‌ను డైల్యూట్ చేసుకోవద్దు.. డిస్ట్రబ్ చేసుకోవద్దు.. ఎవరన్నా వస్తానన్నా వద్దంటాడు. తన మీద తనకు అంత నమ్మకం. తన ప్రజాభిమానం మీద తనకు అంత నమ్మకం. వీ విష్ హిమ్ ఆల్ ది వెరీ బెస్ట్. విమర్శలు లేకపోతే రాజకీయాల్లో అందం లేదు. అర్థం లేదు. థట్స్ ఇట్’’ అని అన్నారు. జర్నలిస్ట్ ప్రభు మెగాస్టార్‌కు మరో ప్రశ్న వేశారు. ‘‘ మీరు రాజకీయాలతో అంటీ ముట్టన్నట్లు ఉంటున్నారా? లేక వద్దనుకుంటున్నారా?’’ అని అడగ్గా.. ‘‘ నా పాలసీ ప్రకారం వద్దను కుంటున్నాను.
నో మోర్ పాలిటిక్స్.. అలాగని చెప్పేసి తమ్ముడిని దూరం చేసుకోలేను కదా.. నా తమ్ముడు.. థట్స్ ఇట్.. నా తమ్ముడు ఎప్పుడూ నా తమ్ముడే.. నా బిడ్డ లాంటి వాడు. నాకు పాలిటిక్స్ వద్దు.. థట్స్ ఇట్’’ అని మెగాస్టార్ కుండ బద్ధలు కొట్టారు. కాగా, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న వాల్తేరు వీరయ్య సినిమాలో మాస్ మహారాజా రవి తేజ ఫుల్ లెన్త్ క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌కు మంచి స్పందన వస్తోంది. మెగా ఫ్యాన్స్‌తో పాటు రవి తేజ ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. సంక్రాంతి బరిలో దిగనున్న ఈ సినిమా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టనుందో వేచి చూడాల్సిందే. మరి, పవన్ కల్యాణ్‌కు మద్దతుపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.