మూవీ ఆర్టిస్ట్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా సాగుతున్నాయి. పెద్దఎత్తున ఏర్పాట్లు చేశాయి. తెల్లవారుజామునే రెండు ప్యానళ్ల సభ్యులు జూబ్లిహిల్స్‌లోని ఎన్నికల కేంద్రానికి చేరుకుని ఏర్పాట్లను పరిశీలించారు. విష్ణు ప్యానల్ తరఫున మంచు మోహన్ బాబు ఎన్నికల కేంద్రం వద్దే ఉండి అందరినీ పలకరిస్తూ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఎర్పాట్లు పరిస్థితులపై మోహన్‌బాబు సూచనలు చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యులు సైతం ఓటు హక్కు వినియోగించుకునే వారికి సహకరించేందుకు కేంద్రం వద్దే ఓటింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకి పెద్దన్న పాత్ర పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి అందరికంటే ముందే పోలింగ్ కేంద్రానికి చేరుకుని తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎన్నికల ఏర్పాట్లు ఎలా చేశారు.. ఓటింగ్ సవ్యంగానే సాగుతుందా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు చిరంజీవి.