Rare Incidence: ఓ మనిషి మరో మనిషి రక్తం తాగటం అన్నది అత్యంత అరుదైన సందర్భాల్లో మాత్రమే జరుగుతూ ఉంటుంది. ఆ రక్తం తాగే వాళ్లు సైకోలు అవ్వటమో.. లేక కన్నిబల్స్ అవ్వటమో అయితే కానీ, ఇలాంటి పనులు చేయలేరు. ఇలాంటి వారిని జైల్లోనో.. పిచ్చి ఆసుపత్రుల్లోనో చూడటం తప్పించి బయట కనపడరు. కానీ, రక్తం తాగే మనుషులు జనారణ్యంలో ఉన్నారంటే నమ్ముతారా?.. నమ్మి తీరాల్సిందే. ఎందుకంటే ఓ సెలెబ్రిటీ జంట ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. అమెరికన్ నటి మేఘన్ ఫాక్స్, ఆమె ప్రియుడు మిషిన్ గన్ కెల్లీలు ఒకరి రక్తం ఒకరు తాగుతారు. ఈ విషయాన్ని చాలా రోజుల క్రితమే ఆమె బయటపెట్టారు. ప్రియుడితో ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ విషయాన్ని వెల్లడించారు.
దీంతో ఈ రక్తం తాగే జంట సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా, ఈ విషయంపై మేఘన్ ఫాక్స్ స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ అవును మేము ఒకరి రక్తం ఒకరం తాగుతాము. అలా చాలా సార్లు తాగాము. ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుందేమో. మమ్మల్ని గేమ్ ఆఫ్ థ్రోన్స్, గాబ్లెట్స్‌లాంటి వాళ్లలాగా ఊహించుకుంటూ ఉంటారు. మేము కేవలం రెండు చుక్కల రక్తం మాత్రమే తాగుతాము. అది కూడా కొన్ని పూజల్లో భాగంగా అలా చేస్తాము. దానికి కూడా ఓ కారణం ఉంటుంది. కంట్రోల్‌గా ఉంటాము’’ అని అన్నారు. మరి, ఒకరి రక్తం ఒకరు తాగే ఈ జంటపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Salim Ghouse: బ్రేకింగ్.. చిరంజీవితో నటించిన స్టార్ యాక్టర్ కన్నుమూత!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.