రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఇప్పటికే పెప్సీ, ఎయిర్‌టెల్, టాటా డొకోమో, హ్యాపీ మొబైల్స్‌కు ఇప్పటివరకు రాంచరణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఇక నుంచి మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్ ఖాతాలో మరో బిగ్ బ్రాండ్ చేరబోతోంది. రామ్‌చరణ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కు అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు. అందుకు హాట్‌స్టార్ ఆఫర్ చేస్తున్న మొత్తం కూడా కళ్లు చెరిలే ఉంది. కొన్నేళ్లపాటు రామ్‌చరణ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌కి ప్రచారకర్తగా వ్యవహరించనున్నాడు. ఇందుకు గానూ సంవత్సరానికి దాదాపు 6 నుంచి 7 కోట్లు రామ్‌చరణ్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రెమ్యునరేషన్ పరంగా చూసుకుంటే ఇది రామ్‌చరణ్ బ్రాండ్ ఇమేజ్ ఎంత అన్నది తెలుస్తోంది.
దీనికి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని రామ్‌చరణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశాడు. షూట్‌కు సంబంధించిన ఒక ఫొటోని చరణ్ ట్వీట్ చేశాడు. గోల్డ్ జాకెట్, వైట్ ప్యాంట్‌తో స్కోక్ షాట్‌ను చరణ్ అభిమానులతో పంచుకున్నాడు. రామ్‌చరణ్ అప్‌డేట్‌తో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సినిమాల విషయంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమా షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం రామ్‌చరణ్ ఆచార్య సినిమాకు సంబంధించి హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన సెట్‌లో సాంగ్ షూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్‌తో ఆర్సీ 15 చేస్తున్న విషయం తెలిసిందే. ఇది దిల్‌రాజుకు నిర్మాతగా 50వ సినిమా కావడం మరో విశేషం.