మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో సక్సెస్‌ఫుల్ హీరో పంజా వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే నటుడిగా మంచి గుర్తింపు పొందాడు వైష్ణవ్ తేజ్. రెండో సినిమా ఏకంగా ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడితో పనిచేసే అవకాశం కొట్టేశాడు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘కొండపొలం’ అనే నవల ఆధారంగా సినిమా తెరకెక్కుతున్న కారణంగా అదే పేరు ఖరారు చేస్తారని ఎప్పటి నుంచే టాక్ నడిచింది. చివరికి అదే నిజం అయింది. వైష్ణవ్ తేజ్ తర్వాతి సినిమా టైటిల్ అదే ‘కొండపొలం’. ఈ సినిమాలో ‘ కటారు రవీంద్ర యాదవ్’గా కనిపించబోతున్న వైష్ణవ్ తేజ్ ఫస్ట్ లుక్ కుడా రిలీజ్ చేశారు. ఉప్పెన తరహాలోనే ఈ సినిమాలో కూడా వైష్ణవ్ తేజ్ మాస్ లుక్‌లోనే కనిపించబోతున్నాడు.
ఇక, వైష్ణవ్ తేజ్ సరసన రకుల్ సందడి చేయనుందని తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 8న థియేటర్లలో రిలీజ్ కాబోతోందని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం కొండపొలం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇటీవల పంజా వైష్ణవ్ తేజ్ ఓ చిత్రాన్ని ఖరారు చేశాడు. కేతిక శర్మ కథానాయికగా, గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్ నటించనున్నాడు.
Excited to unveil the title & first look of #PanjaVaishnavTej as Kataru Ravindra Yadav from our film #KONDAPOLAM An Epic Tale Of Becoming, team @DirKrish #Sannapureddi @mmkeeravaani @gnanashekarvs @FirstFrame_Ent @YRajeevReddy1 #JSaiBabu @MangoMusicLabel #KondaPolamOnOct8th pic.twitter.com/AfHFdlDyzs
— Rakul Singh (@Rakulpreet) August 20, 2021