దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన RRR మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుతోంది. ఈ చిత్రంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్ నటన ప్రేక్షకులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంది. ఇప్పటి వరకు మెగా పవర్ స్టార్ గా ఉన్న రామ్ చరణ్.. ఈ చిత్రంతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు. ఈ విషయం ఇలా ఉంచితే ఈ మెగా పవర్ స్టార్ కు చిన్నతనం నుంచి దైవ భక్తి ఎక్కువ. ఆయనకు, అయ్యప్ప స్వామికి ప్రత్యేకానుబంధం ఉంది. ప్రతి ఏటా రాం చరణ్ అయ్యప్ప మాల ధరిస్తుంటాడు. తన చిత్రాల జయాపజయాలతో సంబంధం లేకుండా ఈ మాల వేస్తుంటాడు. ఎన్ని సినిమాలు సెట్స్ పై ఉన్నా రాం చరణ్ మాత్రం మాల ధరించకుండా ఉండడు.ప్రతి ఏడాది మాల ధరిస్తూ సామాన్య భక్తుడిలా అయ్యప్ప సేవలో మునిగిపోతుంటాడు. తాజాగా RRR విజయ సాధించిన ఈ సమయంలో రామ్ చరణ్ మళ్లీ అయ్యప్ప మాలలో కనిపించాడు. ఈ ఫోటోలో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.