మెగాస్టార్ చిరంజీవి.. మెగా కమ్ బ్యాక్ ఇచ్చేశారు. ‘గాడ్ ఫాదర్’తో థియేటర్స్ అన్నీ షేక్ చేసి పడేస్తున్నారు. తొలిరోజే వరల్డ్ వైడ్ రూ.38 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా.. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి చాలా సులభంగా రూ.100 కోట్ల మార్క్ అందుకుంటుంది. ఇక సినిమాలో చిరుతో పాటు సత్యదేవ్, నయనతార, సల్మాన్ ఖాన్ తదితరులు.. తమ నటనతో మెప్పించి, ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నారు. సినిమా రిలీజ్ కంటే ముందు ప్రమోషన్స్ గట్టిగా చేశారు. అందులో నటి అనసూయ కనిపించలేదు. దీంతో మెగాఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. ఇప్పుడు ఇదే విషయమై స్పందిస్తూ అనసూయ క్లారిఫికేషన్ ఇచ్చింది.
HUMONGOUS BLOCKBUSTER #GodFather off to a sensational start 💥
Worldwide gross of 38 CR+ on DAY 1 🔥Book your tickets now! 🔥
–https://t.co/qO2RT7dqmM#BlockbusterGodfather 🔥@KChiruTweets @BeingSalmanKhan @jayam_mohanraja #Nayanthara @MusicThaman @ActorSatyaDev @ProducerNVP pic.twitter.com/oEgdbINa2d— Konidela Pro Company (@KonidelaPro) October 6, 2022
ఇక వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చేసిన గత రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయి. దీంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. దసరాకి ‘గాడ్ ఫాదర్’ విడుదల అనేసరికి అంచనాలు పెంచేసుకున్నారు. వాటన్నింటినీ నిజం చేస్తూ తొలిరోజే హిట్ టాక్ తెచ్చుకుంది. రెండున్నర గంటలపాటు మాస్ ఆడియెన్స్ కి ఐ ఫీస్ట్ ఇస్తోంది. ఇకపోతే ఈ చిత్రంలో యాంకర్ అనసూయ కూడా ఓ పాత్ర పోషించింది. కాకపోతే ప్రమోషన్స్ లో మిగతా నటీనటులు అందరూ కనిపించారు. కానీ ఈమె మాత్రం ఎక్కడికీ రాలేదు.
ఇక ఓ నెటిజన్స్.. ‘గాడ్ ఫాదర్ మూవీలో మీ రోల్ నాకెంతో నచ్చింది. ఇంత మంచి రోల్ చేసినప్పటికీ మీరెందుకు ప్రమోషన్స్ లో ఎక్కడా కనిపించలేదు’ అని ట్వీట్ చేశాడు. దీనికి రీట్వీట్ చేసిన అనసూయ.. ‘మీరు ఇది నమ్మాలి. ఒకే సమయంలో చాలా షూటింగ్స్ కి అటెండ్ అయ్యాను. మిమ్మల్ని ఎంటర్ టైన్ చేయడం కోసం నేనెంతో కష్టపడుతున్నాను’ అని రాసుకొచ్చింది. కాగా అనసూయ ట్వీట్ పై నెటిజన్స్ డిఫరెంట్ గా స్పందిస్తున్నారు. నిజంగా షూటింగ్స్ లో బిజీగా ఉందేమోనని కొందరు అంటుంటే, ఒక్క ట్వీట్ చేయడానికి కూడా ఆమెకి టైమ్ లేదా, గాడ్ ఫాదర్ కంటే షూటింగ్స్ ఎక్కువయ్యాయా అని మెగాఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. మరి అనసూయ, గాడ్ ఫాదర్ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
Thank you andi! Meeru nammali.. chala shoots okesari jarugutunnai.. I am working hard to entertain y’all 😛🫣 https://t.co/uev9WrKQQX
— Anasuya Bharadwaj (@anusuyakhasba) October 5, 2022