Chiranjeevi: తెలుగు చిత్రసీమలో మెగాస్టార్ చిరంజీవి అనే పేరుకున్న ప్రస్థానం వేరు. సినీనటుడిగా ఆయనకు అభిమానుల గుండెల్లో ఎంతటి క్రేజ్, ప్రేమాభిమానాలు ఉన్నాయో.. ఒక మంచి మనిషిగా ప్రపంచం ఆయనకిచ్చే గౌరవమర్యాదలు కూడా ఎల్లప్పుడూ గొప్పస్థాయిలోనే ఉంటాయి. టాలీవుడ్ లో మెగాస్టార్ అంటే.. ఫ్యాన్స్ లో వచ్చే ఉత్సాహాన్ని, ఊపును ఎవ్వరూ ఆపలేరు. అభిమానుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసే పేరే చిరంజీవి అలియాస్ కొణిదెల శివశంకర వరప్రసాద్.
ప్రపంచానికి మెగాస్టార్ గా.. అభిమానులకు అండగా నిలిచే అన్నగా.. ఎదుటివారి ఎంతటివారైనా, ఎలాంటివారైనా ఆపదలో ఉన్నారంటే ఆదుకునే ఆపద్భాంధవుడిగా.. సామాన్య జనాల కోసం బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంకు.. ఇలా ప్రతి విషయంలో ఎల్లప్పుడూ ఆదర్శంగా నిలుస్తూ వస్తున్నారు చిరంజీవి. ఓవైపు ఇండస్ట్రీ అభివృద్ధికి, సినీ కార్మికుల సంక్షేమానికి ముందుంటూ.. మరోవైపు ప్రజలకు నిరంతరం రక్తదానం, నేత్రదానం, ఇతర సేవా కార్యక్రమాలకై కృషి చేస్తున్నారు.
తెలుగు జనులంతా ప్రేమించే మెగాస్టార్ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ అందరికి పండగే అని చెప్పాలి. ప్రతియేటా ఎంతో ఘనంగా మెగాస్టార్ బర్త్ డే వేడుకలు జరుపుతుంటారు ఫ్యాన్స్. అయితే.. ఈసారి మాత్రం చాలా గ్రాండ్ గా ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది. ఆయన పుట్టినరోజుకు వారం రోజుల ముందునుండే అంటే.. ఆగష్టు 15 నుండి బర్త్ డే రోజు వరకూ.. ఒక్కోరోజు ఒక్కో సేవాకార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు ప్రకటించారు.
ఈ నేపథ్యంలో చిరంజీవి బర్త్ డే సందర్భంగా అఖిల భారత చిరంజీవి యువత చేపట్టనున్న కార్యక్రమాలు ఈ విధంగా ఉన్నాయి. ఆగష్టు 15న మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభోత్సవం, 16న మొక్కలు నాటే కార్యక్రమం, 17న మెగా డ్యాన్స్ పోటీలు, 18న మెగాస్టార్ పేరుమీద ఆంజనేయస్వామి ఆలయంలో ఘనమైన పూజలు, 19న స్కూల్ పిల్లలకు క్యాన్సర్ పరీక్షా శిబిరాలు, 20న అన్నదాన కార్యక్రమాలు, 21న మెగా రక్తదాన శిబిరాలు.. ఇక ఫైనల్లీ 22న అమ్మవారి దేవాలయంలో శ్రీ చిరంజీవి గారి ‘జనకుల’ గోత్ర నామాలతో పూజలు.. అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో తెలిపారు. మరి మెగాస్టార్ బర్త్ డే వేడుకల ప్రణాళికపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.