గతంలో ప్రముఖ రచయిత యండమూరి వీరేంధ్రనాథ్ రామ్ చరణ్‌పై సంచలన కామెంట్లు చేశారు. నీ తండ్రి ఎవరు అనేది కాదు.. నువ్వు ఎవరు అనేది ముఖ్యం అంటూ ఒకరకంగా విమర్శలు గుప్పించారు. సరిగ్గా 6 ఏళ్ల తర్వాత చరణ్ దానికి గట్టి సమాధానం ఇచ్చారు.
మనకు ఎదురయ్యే విమర్శలన్నిటికి మనమే సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిటికి కాలమే సరైన సమాధానం చెబుతుంది. ఇది అక్షరాలా నిజం. ఇందుకు రామ్ చరణ్- యండమూరి వీరేంధ్రనాథ్ వివాదమే ప్రత్యక్ష ఉదాహరణ. దాదాపు ఆరేళ్ల క్రితం ఓ సెమినార్‌లో యండమూరి మాట్లాడుతూ.. ‘‘ చిరంజీవి ఫాదర్ అయ్యాడు. రామ్ చరణ్ తేజ పుట్టాడు. రామ్ చరణ్‌ను హీరోను చేయాలని వాళ్లమ్మ చిన్నప్పటినుంచే కరాటే, డ్యాన్స్‌లు నేర్పటం చేసింది. చరణ్ దవడను ఆపరేషన్ ద్వారా సరిచేశారు. మీరు రామ్ చరణ్ పేరు చెబుతున్నపుడు చప్పట్లు కొట్టలేదు. దేవీ శ్రీ ప్రసాద్ పేరు చెప్పగానే చప్పట్లు కొట్టారు. నీ తండ్రి ఎవరు అనేది కాదు.. నువ్వు ఎవరు అనేది ముఖ్యం’’ అని కొంత విచక్షణ మరిచి రామ్ చరణ్ గురించి మాట్లాడారు.
అప్పట్లో యండమూరి వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. మెగా ఫ్యాన్స్ యండమూరి మీద విరుచుకుపడ్డారు. మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. ఓ సినిమా స్టేజీపై యండమూరిపై ఫైర్ అయ్యారు. రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి. ఈ వివాదాన్ని అందరూ మర్చిపోయారు. ఆఖరికి యండమూరి, మెగా ఫ్యామిలీ కూడా. కానీ, కాలం మాత్రం సమాధానం చెప్పటానికన్నంటూ మౌనంగా ఇన్నేళ్లు ఆగింది. రామ్ చరణ్ ఓ తెలుగు హీరో స్థాయినుంచి ప్యాన్ వరల్డ్ హీరో స్థాయికి ఎదిగారు. తండ్రిని మించిన తనయుడు అయ్యారు. ఒకప్పుడు చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ అని చెప్పుకుంటే.. ఇప్పుడు రామ్ చరణ్ తండ్రి చిరంజీవి అని చెప్పుకుంటున్నారు.
బాలీవుడ్‌లోనే కాదు హాలీవుడ్‌లోనూ చరణ్ పేరు మారుమోగుతోంది. ఏ భారతీయ నటుడికి దక్కని గౌరవాలు ఆయనకు దక్కుతున్నాయి. ప్రపంచ స్థాయి సినిమా ఈవెంట్లను రిప్రెసెంట్ చేస్తున్నారు. విదేశీ సినిమా వేదికలపై హాలీవుడ్ ప్రముఖులతో ప్రశంసలు పొందుతున్నారు. ఈ నేపథ్యంలో యండమూరి-రామ చరణ్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రామ్ చరణ్ ఎదుగుదలను చూపిస్తూ.. మెగాఫ్యాన్స్ యండమూరికి కౌంటర్లు ఇస్తున్నారు. ‘మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి. ఎవరి మీద కామెంట్లు చేస్తున్నామో స్ప్రహ ఉండాలి’.. ‘ రామ్ చరణ్ తన సక్సెస్‌తో యండమూరికి సమాధానం చెప్పాడు’. ‘సక్సెస్, టాలెంట్ ఎవడి సొత్తు కాదు.. చరణ్ ఈ స్థాయికి రావటానికి ఆయన టాలెంటే కారణం’ అని అంటున్నారు. మరి, చరణ్ సాధించిన ఈ సక్సెస్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.