ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగా హీరోలు. కేవలం 30 రోజల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఈ మెగా మూవీ సీజన్‌ను స్టార్ట్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌కి మాంచి కిక్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు మెగా హీరోలు. కేవలం 30 రోజల వ్యవధిలోనే ఏకంగా నాలుగు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నారు. మెగా ఫ్యామీలీకి సపరేట్ ఫ్యాన్స్ ఉంటారు. మెగా ఫ్యామిలీ నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా నెట్టింట తెగ వైరల్ చేస్తుంటారు. సినిమా రిలీజ్ డేట్ వస్తే చాలు ఫ్యాన్స్‌కి పెద్ద పండగే. సినిమాల రిలీజ్‌తో పాటు ఆగస్ట్ 22న చిరంజీవి పుట్టిన రోజు ఉండడంతో ఈ సందడి మరింత పెరగనుంది. అయితే మొదటగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ఈ మెగా మూవీ సీజన్‌ను స్టార్ట్ చేస్తున్నారు. జులై 28న మామా, అల్లుళ్లు పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ కలసి నటించిన ‘బ్రో’ మూవీ రిలీజ్ కానుంది.
ఇందులో పవన్ కళ్యాణ్ దేవుడిగా కనిపించబోతున్నాడు. సాయి ధరమ్ తేజ్ భక్తుడి పాత్ర పోషించనున్నాడు. తమిళ చిత్రం ‘వినోదయ సీతమ్’కు రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘బ్రో’ సినిమాకు తమిళ దర్శకుడు, నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఆగస్ట్ 11న ‘భోళా శంకర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తున్నాడు. చిరంజీవికి జోడీగా తమన్నా నటిస్తుంది. కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటిస్తుండగా.. సుశాంత్ కీర్తి సురేష్‌కి జోడీగా నటిస్తున్నాడు. ‘భోళా శంకర్’ రిలీజ్ అనంతరం వారం రోజుల గ్యాప్‌లో.. ఆగస్ట్ 18న మరో మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ ‘ఆది కేశవ’ రానుంది.
శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ మాస్ యాక్షన్ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత. ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలున్నాయి. వీటితో పాటు వరుణ్ తేజ్ ‘గాండీవ దారి అర్జున’ ఆగస్ట్ 25న రిలీజ్‌కి సిద్దమవుతుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ మూవీకి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఏజెంట్’ ఫేమ్ సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తుంది. ఇలా ఐదుగురు మెగా హీరోలు 30 రోజుల వ్యవధిలో వరుసపెట్టి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారు. మొత్తానికి ఫ్యాన్స్‌కి నెల రోజుల పాటు మెగా మూవీ ఫెస్టివల్ అన్న మాట. మరి దీనిపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ రూపంలో తెలపండి.