వాల్ పోస్టర్ సినిమా బ్యానర్‌పై న్యాచురల్ స్టార్ నాని, ప్రశాంతి తిపిర్ నేని అసోసియేషన్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మీట్ క్యూట్’. మూడు రోజుల క్రితం గ్రాండ్ గా లాంఛ్ అయింది. దీప్తి ఘంట డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ నటుడు సత్యరాజ్ కీ రోల్ పోషిస్తున్నాడు. బాహుబలి కాస్ట్యూమ్ డిజైనర్ ప్రశాంతి కో ప్రొడ్యూస్ చేస్తోంది. ఈ చిత్రంలో మొత్తం ఐదురగురు కథానాయికలు ఉంటారు. ఐదుగురు హీరోయిన్స్ ఎవరనే విషయాన్ని మాత్రం ఒక్కో సందర్భంలో రివీల్ చేస్తానని చెప్పుకొచ్చాడు నాని. కాజల్ అగర్వాల్, నివేదా థామస్, ఆదా శర్మ, రుహాణీ శర్మ ఫీమేల్ లీడ్స్ పోషిస్తున్నారని తాజా టాక్.
పూజా కార్యక్రమాలతో ఇటీవల ఈ సినిమా ప్రారంభమైంది. ఇక ఈ సినిమాలో ఫీమేల్ లీడ్ రోల్స్ విషయంపై ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. లీడ్ రోల్ పోషించే ఐదో నటి ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలున్నట్టు సమాచారం.ఈ చిత్రానికి విజయ్ బల్గానిన్ మ్యూజిక్ డైరెక్టర్. వసంత్ కుమార్ కెమెరా వర్క్ చేస్తున్నాడు.
Wall Poster Cinema Production No 4 🎬#MeetCute
A new journey begins today :))
This one’s special for more than one reason ❤️@mail2ganta @lightsmith83 @VijaiBulganin @vinay2780 @artkolla @Garrybh88 @PrashantiTipirn @walpostercinema pic.twitter.com/8ToWRgu4Zu— Nani (@NameisNani) June 14, 2021