మీరా జాస్మిన్.. తెలుగు ప్రేక్షకులకు ఈ ముద్దగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కొన్నిరోజులు అయితే ఈ మలయాళ భామను తెలుగమ్మాయనే అనుకున్నారు. టాలీవుడ్ లో బాలకృష్ణ, పవన్ కల్యాణ్, రవితేజ వంటి బడా హీరోల సరసన నటించి మెప్పించింది. అయితే ఒక దశాబ్దకాలంగా ఈ బ్యూటీ తెలుగు సినిమా చేయలేదు. టాలీవుడ్ కి గత పదేళ్లుగా దూరంగా ఉంటోంది. అయితే ఇప్పుడు మళ్లీ తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు ఈ అమ్మడు సిద్ధమైంది. అందుకు సంబంధించిన ఓ క్రేజీ అప్ డేట్ కూడా వచ్చింది.
మీరా జాస్మిన్ తిరిగి తెలుగులో నటించేందుకు సిద్ధమైంది. ఆ విషయాన్ని స్వయంగా ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. డబ్బింగ్ చెబుతున్న ఓ ఫొటోను షేర్ చేసింది. దానికి హ్యాష్ ట్యాగ్ తెలుగు సినిమా అని పెట్టింది. అయితే ఏ సినిమాలో నటిస్తోంది? డైరెక్టర్ ఎవరు? హీరో ఎవరు? ఇలాంటి ఏ సమాచారాన్ని వెల్లడించలేదు. అయితే గతంలో మాదిరిగా సాఫ్ట్ గా కాకుండా ఈ పాత్ర కాస్త ఘాటుగానే ఉంటుందని చెబుతున్నారు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే చాలాకాలం తర్వాత ఆమె తెలుగు సినిమా చేస్తోందని తెలిసి ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మీరా జాస్మిన్ అవకాశాలు రాక ఇన్నేళ్లు టాలీవుడ్ కి దూరంగా ఉందా? లేక మలయాళం సినిమాలతో బిజీగా ఉండి తెలుగు సినిమాలు ఒప్పుకోలేదా? అనే విషయంలో క్లారిటీ లేదు. 2013లో మోక్ష అనే తెలుగు సినిమాలో చివరిగా నటించింది. అప్పటి సినిమాల్లో ఎంతో హోమ్లీగా, లంగాఓణీ, చీరలు కట్టుకుని నటించి ఈ అమ్మడు ఇప్పుడు ట్రాక్ మార్చింది. తన సోషల్ మీడియా ఖాతాల్లో బోల్డ్ చిత్రాలను పోస్ట్ చేయడం మొదలు పెట్టింది. అయితే తాను గ్లామరస్ రోల్స్ కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెప్పేందుకే హీరోయిన్లు ఇలాంటి ఫొటో షూట్లు చేస్తుంటారు. అంతేకాకుండా అవకాశాలు లేకపోయినా కూడా లైమ్ లైట్ లో ఉండేందుకు అవి ఉపయోగ పడతాయి