Meena: ప్రముఖ హీరోయిన్ మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం ఆమె జీవితంలో తీరని విషాదాన్ని మిగిల్సింది. మీనా అనారోగ్యంతో ఉన్న తన భర్త ప్రాణాల కోసం ఆఖరి వరకు పోరాడింది. అయినా, లాభం లేకపోయింది. లంగ్స్ ఇన్‌ఫెక్షన్ కారణంగా మంగళవారం ఆయన మరణించారు. నిండు నూరెళ్లు కలిసి బ్రతకాలనుకున్న జంటను ఆ దేవుడు వేరు చేశాడు. ఎప్పుడూ పసి పాపలా నవ్వులు చిందించే మీనా ముఖంలో విషాదాన్ని నింపాడు. వాస్తవానికి మీనా-విద్యాసాగర్‌లది భార్యభర్తల సంబంధం మాత్రమే కాదు.. ఎన్నెన్నో జన్మల బంధం కూడా. మొదట విద్యాసాగర్‌ను రిజెక్ట్ చేసి, మళ్లీ ఆయన్నే పెళ్లి చేసుకున్నారు మీనా.
దాని గురించి ఓ షోలో మీనా మాట్లాడుతూ.. ‘‘ నాకు ఇంట్లో వాళ్లు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. అప్పుడు విద్యాసాగర్ సంబంధం వచ్చింది. ఇద్దరి జాతకాలు కలవటంతో ఇంట్లో వాళ్లు ఒకే అన్నారు. ఓ సారి నేను అతడ్ని కలిసి మాట్లాడాను. కానీ, నాకు అతడు నచ్చలేదు. ఎందుకంటే.. ఇద్దరి వృత్తులూ వేరు.. ఆలోచనలు వేరూ.. ఇదే విషయాన్ని విద్యాసాగర్‌కు చెప్పాను. అతను నన్ను అర్థం చేసుకున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
ఆ తర్వాత మా ఆంటీ నాతో గట్టిగా ఓ మాట చెప్పింది. నేను ఓ మంచి మనిషిని దూరం చేసుకుంటున్నానని హెచ్చరించింది. ఆమె అంత గట్టిగా చెప్పిన తర్వాత దాని గురించి ఆలోచించా. ఆ తర్వాత విద్యాసాగర్‌తో పెళ్లికి ఒకే చెప్పా. అప్పటినుంచి ఇప్పటివరకు నేను నా భర్త విషయంలో ఎప్పుడూ బాధపడలేదు’’ అని చెప్పకొచ్చారు. మరి, భర్త విద్యాసాగర్ లేని లోటు మీనాకు తీర్చలేనిది. అయినప్పటికి.. బిడ్డ కోసం ఆమె త్వరగా మామూలు మనిషి కావాలని కోరుకుంటూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Meena: భర్త అంత్యక్రియల్ని అన్నీ తానై జరిపిన మీనా!..