సూపర్ స్టార్ మహేశ్ బాబు– కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’ ఈ సినిమా మే 12న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి. అనంత శ్రీరామ్ లిరిక్స్, తమన్ మ్యూజిక్ అందించిన కళావతి సాంగ్ యూట్యూబ్ సెన్సేషన్ గా నిలిచింది. తాజాగా రెండో లిరికల్ సాంగ్ ‘పెన్నీ’ కూడా విడుదలైంది. ఈ సాంగ్ లో సితార ఘట్టమనేని కూడా నటించడం అందరనీ ఆకట్టుకుంటోంది. పెన్నీ సాంగ్ యూట్యూబ్ లో వైరల్ గా మారింది. ఇప్పుడు చాలా మంది పెన్నీ అంటే ఏంటి అని వెతుకులాట మొదలు పెట్టారు.
ఇదీ చదవండి: స్టేజ్ పైనే సీరియస్ అయిన రాజమౌళి.. ఎప్పుడూ ఇలా చూసుండరు!
పెన్నీ అనేది యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన నగదు. మనకు పైసా ఎలాగో వారికి పెన్నీ అలాంటిది. గతంలో పౌండ్ లో పెన్నీ 240వ భాగంగా ఉండేది. ప్రస్తుతం పెన్నీ- పౌండ్ లో వందో వంతుగా ఉంది. మన రూపాయిలో వందో వంతు పైసా ఎలాగో అలాగే పెన్నీ కూడా. సర్కారు వారి పాట మొత్తం డబ్బు చుట్టూ తిరిగే కథ. మహేశ్ మెడపై కూడా రూపాయి టాటూ ఉంటుంది. అలాగే డబ్బును రిప్రెసెంట్ చేసే పాటను పెట్టారని భావిస్తున్నారు. ఈ సాంగ్ ఎలా ఉందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.