అభిమాన హీరో బర్త్ డే అంటే అభిమానులకు పండుగ రోజే. ఎప్పుడెప్పుడు తమ ఫేవరేట్ హీరో బర్త్ డే వస్తుందా.. ఎప్పుడెప్పుడు సెలబ్రేట్ చేద్దామా అని ఏడాదంతా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. ప్రస్తుతం నందమూరి ఫ్యాన్స్ అంతా సెలబ్రేషన్స్ మూడ్ లోనే ఉన్నారు. అందుకు కారణం.. మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు. ప్రతిసారిలాగే ఈసారి కూడా ఫ్యాన్స్ వేరే లెవెల్ లో ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్ ప్లాన్ చేసినట్లు తెలుస్తుంది.
ఇప్పటికే ఎన్టీఆర్ బర్త్ డే కామన్ డీపీ, హ్యాష్ ట్యాగ్ లతో సోషల్ మీడియాలో సందడి మొదలైపోయింది. ఈ క్రమంలో తారక్ తదుపరి సినిమాల నుండి కొత్త అప్ డేట్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. RRR సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్న ఎన్టీఆర్.. తదుపరి సినిమాను కొరటాల శివ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ఇదివరకు వీరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో #NTR30 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కనున్న ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి.
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి తాజాగా మాసివ్ డైలాగ్ తో అభిమానులకు ట్రీట్ ఇచ్చారు మేకర్స్. పోస్టర్ లో తారక్.. వర్షంలో రక్తంతో తడిసిన ఓ కత్తిని పట్టుకొని..”అప్పుడప్పుడు ధైర్యానికి కూడా తెలీదు.. అవసరానికి మించి తాను ఉండకూడదని.. అప్పుడు భయానికి తెలియాలి.. తను రావాల్సిన సమయం వచ్చిందని.. వస్తున్నా” అంటూ ఎన్టీఆర్ చెప్పిన మాసివ్ డైలాగ్.. నందమూరి ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తోంది. ఎన్టీఆర్ బేస్ వాయిస్ కి తోడు అనిరుధ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గూస్ బంప్స్ కలిగిస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక #NTR30 మూవీ ఒక రివేంజ్ డ్రామా అని సినీవర్గాలు చెబుతున్నాయి. అన్ని కమర్షియల్ హంగులతో.. కొరటాల స్క్రిప్ట్ సిద్ధం చేశాడని తారక్ స్వయంగా వెల్లడించడం విశేషం. తాజాగా విడుదలైన పోస్టర్ చూస్తుంటే.. యాక్షన్ పీక్స్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.
He is here to change the way you know fear 🔥
Here’s the FURY OF #NTR30 (Telugu)
▶️ https://t.co/7rW5wkzPhB#HBDManOfMassesNTR@tarak9999 #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @RathnaveluDop @sabucyril @sreekar_prasad @NTRArtsOfficial pic.twitter.com/P0FlYQhIKh— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2022
గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఎన్టీఆర్ తో కొరటాల సినిమా ప్లాన్ చేశాడు. ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా షూటింగ్ జూన్ లో ప్రారంభం కాబోతుంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ సమర్పణలో యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై మిక్కిలినేని సుధాకర్ భారీ బడ్జెట్ తో ఈ పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా.. సినిమాటోగ్రాఫర్ గా రత్నవేలు, ప్రొడక్షన్ డిజైనర్ గా సాబు సిరిల్, ఎడిటర్ గా శ్రీకర్ ప్రసాద్ వ్యవహరించనున్నాడు. ఇంకా ఎన్టీఆర్ సరసన హీరోయిన్ ఎవరు? అనేది తెలియాల్సి ఉంది.
Here’s the FURY OF #NTR30 (Hindi) pic.twitter.com/BK7FJU06QE
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2022