సోషల్ మీడియా వచ్చాక ట్యాలెంట్ ఉన్న వాళ్లకు అవకాశాలకు కొదవ లేకుండా పోయాయి. కేవలం యూట్యూబ్, టిక్ టాక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రస్తుతం సెలబ్రిటీ హోదా సంపాదించుకున్న వారు ఎందరో. అలాంటి వారిలో దీప్తీ సునైనా, అలేఖ్య హారికా పేర్లు కచ్చితంగా ఉంటాయి. టిక్ టాక్, యూట్యూబ్ వీడియోలతో తమ కెరీర్ ను ప్రారంభించిన వీళ్లు ఆ తర్వాత బిగ్ బాస్ స్టేజ్ వరకు వెళ్లి ఒక సెలబ్రిటీ హోదాను సంపాదించుకున్నారు. దీప్తీ సునైనా– అలేఖ్య హారికలో కామన్ గా ఉండే క్వాలిటీ ఏంటంటే.. వాళిద్దరూ మంచి డాన్సర్స్. ట్రిపులార్ సినిమాలో తారక్- రామ్ చరణ్ డాన్స్ ఇరగదీసిన నాటు నాటు పాటకు దీప్తీ- అలేఖ్య ఇద్దరూ వారిదైన స్టైల్ లో ఊర నాటు స్టెప్పులు ఇరగదీశారు.
మే 20 నుంచి జీ5 ఓటీటీలో ట్రిపులార్ సినిమా స్ట్రీమ్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే జీ5 వాళ్లు ట్రిపులార్ ఫ్యాన్స్ కి పెట్టిన ఓ కాంటెస్ట్ గురించి వివరిస్తూ వాళ్లు ఆ డాన్స్ చేశారనమాట. నాటు నాటు పాటకు ఫ్యాన్స్ వాళ్ల స్టైల్ లో హుక్ స్టెప్పులు కంపోజ్ చేసి ఆ డాన్సును వీడియో తీసి అలేఖ్య హారిక, దీప్తీ సునైనా, జీ5 ఇండియాలను ట్యాగ్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయాలని చెప్పుకొచ్చారు. అలా చేస్తే ముగ్గురు లక్కీ విన్నర్స్ కు జీ5 గిఫ్ట్ హ్యాంపర్స్ అందజేస్తారంట. ఈ కాంటెస్ట్ మే 20 నుంచి మే 27 వరకు కొనసాగనున్నట్లు తెలియజేశారు. అయితే దీప్తీ సునైనా- అలేఖ్య హారికా వేసిన ఊరనాటు స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీప్తీ- అలేఖ్య ఊర నాటు స్టెప్పులపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.