తెలుగు ఇండస్ట్రీలో చిన్న చిన్న పాత్రల్లో నటించి స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు మాస్ మహరాజ రవితేజ. ‘రాజాది గ్రేట్’చిత్రం తర్వాత వరుస ఫ్లాపులతో సతమతమవుతున్న రవితేజ, ప్రముఖ దర్శకుడు గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’తో సూపర్ డూపర్ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్లో వరుసగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు రవితేజ.
క్రాక్ సూపర్ హిట్ కావడంతో వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు రవితేజ. ఇలాంటి సమయంలో టాలీవుడ్ లో రవితేజపై కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక రవితేజ నటించిన ‘రామారావు ఆన్ డ్యూటీ’కొన్ని అనివార్య కారణాల వల్ల వాచిదా పడినట్లు.. రీ షూటింగ్ కోసం రవితేజ ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో గుస గుసలు వినిపించాయి. అంతేకాదు ఈ మూవీ రిలీజ్ ఆలస్యం కావడానికి ఇదో కారణం అన్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా విడుదల ఆలస్యం కావడానికి కారణం ఇదే అన్నట్లుగా సమాచారం అంతేకాకుండా ప్రమోషన్ పనులు కూడా రాలేదని పలు రకాలుగా రూమర్లు వస్తున్నాయి. ప్రమోషన్ పనులు కూడా రాలేదని పలు రకాలుగా రూమర్లు వస్తున్నాయి.
ఫిలిమ్ ఇండస్ట్రీలో ఇలాంటి వార్తలు రావడం కామన్ అంటూ రవితేజ్ దీనిపై స్పందించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని అన్నారు. ప్రొడ్యూసర్ సుధాకర్ చేకూరితో తనకు మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయని.. రెమ్యూనరేషన్ విషయంలో ఎలాంటి గొడవలు.. సమస్యలు కానీ అస్సలు లేవని ఇవన్నీ పనీపాట లేని వాళ్లు పుట్టించిన మాటలే అన్నారు. మరో విషయం ఏంటంటే.. ‘రామారావు ఆన్ డ్యూటీకి’ మూవీకి తాను కోప్రొడ్యూసర్ ని అని… అలాంటప్పుడు రెమ్యునరేషన్ సమస్య ఎక్కడి నుంచి వస్తుందని రవితేజ ప్రశ్నించారు.
గతంలో నిర్మాతలు ఇబ్బందుల్లో ఉన్నట్లు తెలుసుకొని చెక్కులు చింపేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని అన్నారు. నిర్మాత సుధాకర్ నాకు మంచి స్నేహితులు. నాకు మాత్రమే కాదు.. ఇండస్ట్రీలో ఆయన అందరితోనూ సన్నిహితంగా ఉంటారు. ఈ మద్య కాలంలో సోషల్ మీడియాలో ఇలాంటి రూమర్లు కామన్ అయ్యాయని.. తనపై వస్తున్న తప్పుడు వార్తలను నమ్మొద్దని విన్నవించారు. ఇక ‘రామారావు ఆన్ డ్యూటీకి’ ఈ నెల 29న విడుదల కాబోతోంది. ఈ చిత్రంలో దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్, వేణు తొట్టెంపూడి, నాజర్, నరేశ్, పవిత్ర లోకేశ్ తదితరులు నటించారు.
ఇది చదవండి: Divi Vadthya: మగాళ్లపై బిగ్ బాస్ దివి పంచ్ డైలాగ్.. వైరల్ అవుతున్న వీడియో!