కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగవని అంటుంటారు. అందుకే సినీ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లు కూడా పెళ్లి వార్తలను సడన్ గా ప్రకటిస్తుంటారు. అయితే.. ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ముప్పై ఏళ్ళు దాటితే గాని పెళ్లి గురించి ఆలోచించడం లేదు. అయితే.. పెళ్లికి ఇంకా ఉందేమో అనుకునేలోపు తమ ప్రేమ విషయాన్ని లేదా పెళ్లి కబురును అనౌన్స్ చేస్తుంటారు. కానీ.. కొందరు హీరోయిన్లకు సంబంధించి మాత్రం వారు పెళ్లి గురించి మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో జంటలు కలిపేస్తుంటారు.
తాజాగా స్టార్ హీరోయిన్ హన్సిక గురించి అలాంటి వార్తలే బయటికి వచ్చాయి. మూడు పదుల వయసు దాటిన హన్సిక.. ఇటీవల మహా అనే సినిమాతో కెరీర్ లో 50 సినిమాలు పూర్తి చేసుకుంది. అయితే.. దేశముదురు సినిమాతో హీరోయిన్ గా కెరీర్ ప్రారంభించిన ఈ అమ్మడు.. తెలుగులో స్టార్ హీరోల సరసన మంచి హిట్స్ ఖాతాలో వేసుకుంది. ఇక తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా హన్సిక సత్తా చాటింది. ఎందుకో.. ఈ మధ్య తెలుగు సినిమాలు తగ్గించేసింది.
ఇక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకుంది. కానీ.. దాన్ని ఎక్కువకాలం కాపాడుకోలేకపోయింది. అలాగే గతంలో బొద్దుగా ఉండేది. ఇప్పుడు సన్నగా మారి ఉహించని స్థాయిలో గ్లామర్ షో చేస్తోంది. సోషల్ మీడియా మిలియన్స్ ఫాలోయింగ్ కలిగిన హన్సిక.. ఈ మధ్య టు పీస్ బికినీలో సైతం ఫోటోలకు ఫోజులిచ్చి ఆశ్చర్యానికి గురిచేసింది. మొత్తానికి సినిమాల పరంగా కాకుండా అందాల ప్రదర్శనలో ఫామ్ కొనసాగిస్తోంది హన్సిక.
ఇదిలా ఉండగా.. హన్సిక త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నట్లు వార్తలు ట్రెండ్ అవుతున్నాయి. సౌత్ ఇండియాకు చెందిన ప్రముఖ రాజకీయనేత కుమారుడితో హన్సిక వివాహం జరగబోతుందని, ఈ మేరకు అన్ని సంప్రదింపులు, మాటామంతీ జరిగిపోయాయని టాక్ బలంగా వినిపిస్తోంది. అయితే.. ఆ రాజకీయనేత కుమారుడు ఎవరు? ఏంటనే వివరాలు ఇంకా బయటికి రాలేదు. అదీగాక తన పెళ్లి విషయంపై ఇప్పటివరకు హన్సిక కూడా స్పందించలేదు. కనుక ఈ వార్తలన్నీ ఫేక్ అని ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు. మరి దీనిపై హన్సిక ఎలా స్పందిస్తుందో చూడాలి. హన్సిక పెళ్లి వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.