సినీ ఇండస్ట్రీకి సంబంధించి రెగ్యులర్ గా వార్తలలో నిలిచే క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉన్నారంటే.. ఆ వరుసలో ముందుగా సురేఖావాణి పేరే వినిపిస్తుంది. తెలుగులో ఎన్నో సినిమాలలో ఎన్నో డిఫరెంట్ క్యారెక్టర్స్ లో మెరిసిన సురేఖావాణి.. అక్క, వదిన, డాక్టర్ ఇలా హోమ్లీ రోల్స్ ద్వారా ఫ్యామిలీ ఆడియెన్స్ కి బాగా దగ్గరైంది. అయితే.. సినిమాలలో చాలా డీసెంట్ రోల్స్ తో మెప్పించిన సురేఖా.. రియల్ లైఫ్ లో చాలా మోడరన్ గా జీవనం కొనసాగిస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. తన కూతురు సుప్రీతతో కలిసి మోడరన్ డ్రెస్సింగ్ స్టైల్, లివింగ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది.
ఇక సెలబ్రిటీగా సురేఖావాణికి, సుప్రీతకు సోషల్ మీడియాలో సూపర్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎప్పటికప్పుడు ట్రెండ్ కు తగ్గట్టుగా ఫోటోషూట్స్ చేస్తూ ఇన్ స్టాగ్రామ్ లో ఇద్దరూ కలిసి రీల్స్ కూడా పోస్ట్ చేస్తుంటారు. అయితే.. మోడరన్ మదర్ గా పేరు తెచ్చుకున్న సురేఖా.. కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ ని ఫేస్ చేస్తూ వచ్చింది. ట్రోల్స్ ని లెక్కచేయకుండా తాను చేయాలనుకుంది చేస్తూనే.. తన డ్రెస్సింగ్ స్టైల్ తో సురేఖా వయసు రోజురోజుకూ పెరుగుతుందా తగ్గుతుందా? అని అనుకునేలా చేస్తోంది. అలాగే అడపాదడపా తెలుగుతో పాటు తమిళ సినిమాలు కూడా చేస్తోంది. ఇక మరోవైపు సుప్రీత కూడా లేచింది మహిళా లోకం అనే సినిమాతో ఇండస్ట్రీ డెబ్యూ చేయనుంది.
ఇదిలా ఉండగా.. సురేఖావాణి కూతురిగా అందరికి పరిచయమైన సుప్రీత.. సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు గ్లామర్ ట్రీట్ తో మంచి క్రేజ్ దక్కించుకుంది. మరోవైపు సుప్రీతను ఫాలో అయ్యే ఫ్యాన్స్ అందరూ ఎప్పుడెప్పుడు సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇస్తుందా అని వెయిట్ చేస్తున్నారు. ఇక సుప్రీత అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో చిట్ చాట్ చేస్తుంటుంది. ఈ క్రమంలో డిఫరెంట్ ప్రశ్నలు అడుగుతుంటారు నెటిజన్స్, ఫ్యాన్స్. తాజాగా ఓ నెటిజెన్.. సుప్రీతను పెళ్లి చేసుకుందామా? అని అడిగాడు. దీంతో వెంటనే స్పందించిన సుప్రీత.. “మా అమ్మకు చెప్తా. నీ సంగతి చెప్తుంది. తర్వాత నాకు తెలీదు. తెలిసినా నాకు సంబంధం లేదు భయ్యా” అనేసింది. ప్రస్తుతం సుప్రీత రిప్లై సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరి సురేఖావాణి, సుప్రీత గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.