మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా నటించిన చిత్రం “మరక్కార్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రాన్ని ప్రియదర్శిన్ తెరకెక్కించారు. కీర్తి సురేష్, సునీల్ శెట్టి, అర్జున్, మంజు వారియార్, సుహాసిని వంటి సూపర్ స్టార్స్ ఈ చిత్రంలో నటించారు.
మరక్కార్ సినిమా విడుదల విషయంలో పలు మార్పు జరిగాయి.మొదటగా ఈ సినిమా ను థియేటర్ రిలీజ్ చేయాలని భావించారు. సినిమా చిత్రీకరణ చివరి దశలో కరోనా వల్లన థియేటర్ రిలీజ్ సాధ్యం కాలేదు. ఓటీటీ కి సినిమాను ఇవ్వబోతున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అమెజాన్ వారు మరక్కార్ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ చేయబోతున్నట్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మోహన్ లాల్ అభిమానులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. దీంతో కేరళ ప్రభుత్వం స్పందించి మరక్కార్ సినిమా థియేటర్ రిలీజ్ చేసేందుకు సహకరిస్తామంటూ హామీ ఇవ్వడంతో నిర్మాతలు థియేటర్ రిలీజ్ మరియు ఓటీటీ స్ట్రీమింగ్ లో విడుదలకు సిద్ధమైయారు. దేశ వ్యాప్తంగా గురువారం ఈ సినిమా విడుదలైయింది.
ఇకా కేరళలో మోహన్ లాలా అభిమానుల సందడి అంతఇంత కాదు. సోషల్ మీడియలో ఈ చిత్రం పోస్టర్ ను తెగ షేర్ చేస్తున్నారు.ఈ చిత్రం వసూల్ పరంగా అభిమానులు కొన్ని నమ్మలేని పోస్టులు షేర్ చేశారు. అది ఏమిటంటే..కేవలం అడ్వాన్స్ బుకింగ్ ద్వారా “మరక్కార్” సినిమా వంద కోట్లకు పైగా వసూళ్లను చేసిందని. కేవలం అడ్వాన్స్ బుకింగ్ తో వంద కోట్ల వసూళ్లు దక్కించుకున్న ఇండియన్ సినిమా ఒక్కటి కూడా లేదు. అది కేవలం మోహన్ లాల్ సినిమానే అంటూ ఆయన అభిమానులు నెట్టింట తెగ హడావుడి చేస్తున్నారు.
సాధారణంగా ఏ సినిమా అయిన విడుదలైన మొదటి రోజు లేదా రెండు రోజుల్లో వంద కోట్లు నమ్మదగినది. కానీ మరీ విడుదల కాకుండానే అడ్వాన్స్ బుకింగ్ లతోనే ఇంతా స్థాయిలో వసూళ్లు ప్రకటించడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పబ్లిసిటి కోసం భారీ వసూళ్లు అంటూ ప్రచారం చేయడం తప్పదని ఇటీవల కొందరు నిర్మాతలు తెలిపారు. అదే విధంగా మోహన్ లాల్ అభిమానులు ప్రచారం చేసినట్లు ఆ స్థాయిలో మరక్కార్ సినిమా వసూళ్లు నిజం అయినా కూడా నమ్మశక్యంగా లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.