పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, పూజాహెగ్డే ప్రధాన పాత్రధారులుగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘రాధేశ్యామ్’. గతేడాది కాలంగా ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా! అని ఎదురుచూస్తున్నారు సినీ అభిమానులు. ఇప్పటికే రాధేశ్యామ్ నుండి విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమా పై అంచనాలు రెట్టింపు చేశాయి. మరి రిలీజ్ ఎప్పుడు అనుకుంటున్న టైంలో వాయిదాపడుతూ వచ్చింది.
తాజాగా మేకర్స్ మార్చి 11న రాధేశ్యామ్ రిలీజ్ అని ప్రకటించారు. ప్రతిసారి ప్రకటనలు వస్తున్నాయి కానీ రిలీజ్ డేట్ దగ్గరపడే సరికి వాయిదా పడుతోంది. మరి ఈసారైనా రాధేశ్యామ్ పక్కాగా రిలీజ్ అవుతుందా లేదా అని ప్రభాస్ ఫ్యాన్స్ సందేహపడుతున్నారు. ఇదిలా ఉండగా.. మార్చి 11న రాధేశ్యామ్ రిలీజ్ చేస్తే కలెక్షన్లలో భారీగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రాధేశ్యామ్ మూవీకి 2 వారాల ముందు భీమ్లా నాయక్(ఫిబ్రవరి 25), 2 వారాల తర్వాత RRR(మార్చి 25) సినిమాలు రిలీజ్ కానున్నాయి.
ఈ సినిమాకి థియేటర్స్ అయితే దొరుకుతాయి. కానీ మార్చి నెలలో విద్యార్థులకు పరీక్షలు జరుగుతాయి. ఆ టైంలో రాధేశ్యామ్ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా స్టూడెంట్స్, పేరెంట్స్ సినిమాలకు దూరంగా ఉంటారు. ఇంకా RRR విడుదలైతే రాధేశ్యామ్ థియేటర్లను దాదాపుగా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. మరోవైపు కన్నడలో మార్చి 17 – మార్చి 23 వరకు పునీత్ రాజ్ కుమార్ ‘జేమ్స్’ మూవీని మాత్రమే ప్రదర్శిస్తారు.
ఈ క్రమంలో రాధేశ్యామ్ మూవీకి కన్నడలో లాస్ తప్పదని సినీవర్గాలు చెబుతున్నాయి. అటు తమిళంలో మార్చి 10న సూర్య ఈటీ సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో తమిళంలో ప్రభాస్ సినిమాకి ఎక్కువ థియేటర్లు దొరికే ఛాన్స్ లేదు. అయితే.. రాధేశ్యామ్ విడుదలకు మేకర్స్ కరెక్ట్ డేట్ ఫిక్స్ చేయలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు. మరి మేకర్స్ ఈ విషయం పై పునరాలోచన చేస్తారేమో చూడాలి. ఇక రాధేశ్యామ్ రిలీజ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.