ఇటీవల సినీ ఇండస్ట్రీలో పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. సినీ సెలబ్రెటీలు.. వారి కుటుంబ సభ్యులు కన్నుమూయడంతో అభిమానులు విషాదంలో మునిగిపోతున్నారు. తాజాగా ఫ్యామిలీ మ్యాన్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి గీతాదేవి కన్నుమూశారు. ఆమె వయసు 80 సంవత్సరాలు. గత కొద్ది రోజులుగా ఆమె తీవ్ర అనారోగ్యంతో బాధపడుండగా ఢిల్లీలోని మ్యాక్స్ పుష్పాంజలి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఉదయం తుది శ్వాస విడిచారు.
గత ఏడాది ఆయన తండ్రి రాధాకాంత్ బాజ్‌పేయి కన్నుమూశారు. ఆ విషాదం నుంచి కోలుకోక ముందే తల్లి గీతా దేవి కన్నుమూయడంతో ఆయన కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. తన తల్లి తనకు ప్రతి విషయంలో సలహాలు సూచనలు ఇస్తూ ఉండేదని.. తల్లిదండ్రులు అంటే ఎంతో ఇష్టమని మనోజ్ బాజ్‌పాయ్ పలు ఇంటర్వ్యూల్లో వెల్లడించారు. సుమంత్ నటించిన ‘ప్రేమకథ’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన హ్యాపీ, వేదం లాంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నారు.
బాలీవుడ్ లో కెరీర్ మొదలు పెట్టిన మనోజ్ బాజ్‌పాయ్ తన విలక్షణ నటతో ప్రేక్షకుల మనసు దోచాడు. ఇటీవల ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మనోజ్ బాజ్‌పాయ్ జాతీయ ఉత్తమ నటుడిగా, రెండు సార్లు ఉత్తమ సహాయనటుడిగా భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు దక్కించకున్నాడు. తల్లిని పోగొట్టుకున్న మనోజ్ బాజ్‌పాయ్ తీవ్ర దుఖఃంలో ఉన్నారు.. పలువురు సెలబ్రెటీలు కుటుంబానికి ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నారు. గీతా దేవి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.
Manoj Bajpayee’s mother Geeta Devi passes away at 80 after a prolonged illness. @BajpayeeManoj #ManojBajpayee #ManojBajpayeeMother pic.twitter.com/xxrEZVjyVM
— Sandeep Kumar 🇮🇳 (@sandeepravi55) December 8, 2022