బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్ పేయి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. మనోజ్ బాజ్ తండ్రి రాధాకాంత్ బాజ్ పేయి ఈ రోజు తుది శ్వాస విడిచారు. ఇక గత కొంత కాలం నుంచి ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన నేడు ఢిల్లీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతు నేడు మరణించాడు. అయితే మనోజ్ బాజ్ పేయి తన నటనతో ఇటు బాలీవుడ్ లోనే కాకుండా అన్ని సినిమా రంగాల్లో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆయన తండ్రి మరణవార్త తెలియటంతో బాలీవుడ్ నటులు అంతా ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు.