Manoj Bajpayee: సౌత్ సినిమాలు వర్సెస్ హిందీ సినిమాల యుద్ధంలో సౌత్ సినిమాలు వార్ వన్ సైడ్ చేశాయి. నార్త్‌లో కరోనా తర్వాత విడుదలైన హిందీ సినిమాల కంటే సౌత్ సినిమాలే ఆదాయం తెచ్చిపెట్టాయి. నార్త్‌లో థియేటర్ వ్యవస్థను కాపాడింది సౌత్ సినిమానే అని చెప్పొచ్చు. పాన్ ఇండియా సినిమాలు పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్-2లు ఒక్క హిందీ వర్సెన్‌లోనే 100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టాయి. ఈ నేపథ్యంలో సౌత్ సినిమాలపై ప్రశంసల జల్లు కురుస్తోంది. డైరెక్టర్లను, నటులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కొందరు బాలీవుడ్ ప్రముఖులు సౌత్ సినిమాను పొగడటమే కాకుండా.. నిర్మొహమాటంగా హిందీ సినిమా మేకర్ల తీరును తప్పుబడుతున్నారు. సల్మాన్ ఖాన్, సంజయ్ దత్, రవీనా ఠండన్, సోనూసూద్‌లు సౌత్ సినిమానుంచి హిందీ సినిమా ఎంతో నేర్చుకోవాలని తేల్చిచెప్పేశారు.
తాజాగా, ఈ జాబితాలోకి ప్రముఖ నటుడు, ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఫేమ్ మనోజ్ బాజ్‌పేయి చేరారు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘ సౌత్‌నుంచి వరుసగా సూపర్ హిట్లు వస్తుండటంతో హిందీ సినిమా వాళ్ల వెన్నులో వణుకు మొదలైంది. వాళ్లకు ఏం చేయాలో అర్థం కావటంలేదు. సౌత్ సినిమాలు తీసేవారు ఎంతో ప్యాషన్‌తో, తప్పుల్లేకుండా.. తీసే ప్రతీ షాటు ప్రపంచంలోనే ది బెస్ట్‌గా ఉండాలని అనుకుంటారు. ఎంతో ప్యాషన్, ఆలోచనలతో సినిమా తీస్తారు. మనం తీసిందే సినిమా అని వాళ్లు అనుకోరు. ప్రేక్షకులను ఒప్పించటానికి ప్రయత్నించరు. ఎప్పుడూ మెప్పించటానికి మాత్రమే చూస్తారు. ప్రేక్షకుల కోసమే వాళ్లు సినిమాలు చేస్తారు.
కలెక్షన్ల కోసం కాదు. పుష్ప, ఆర్‌ఆర్‌ఆర్, కేజీఎఫ్ సినిమాలు తీసిన విధానం చూస్తే అద్భుతం అనిపిస్తుంది. ప్రతీ ఫ్రేమ్ చావు, బతుకుల ప్రయత్నంగా తీశారు. ఇదే మన హిందీ సినిమా వాళ్ల దగ్గర లోపించింది. మనం ఎప్పుడూ బాక్సాఫీస్ దగ్గర ఎంత డబ్బు కొల్లగొడదామా అని ఆలోచిస్తూ ఉంటాము. మనం మన సినిమాలను విమర్శించుకోము. అక్కడే సమస్యంతా వచ్చింది. హిందీ సినిమా వాళ్లకు ఇదో గుణపాఠం. రామ్‌చరణ్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, పవన్ కల్యాణ్‌లు ఎప్పుడో బాలీవుడ్‌లో స్టార్లుగా ఎదిగారు. హిందీలో డబ్ అయిన వాళ్ల సినిమాలు బాలీవుడ్ మాస్ ప్రేక్షకులను మెప్పించాయి. కానీ, మనం కేవలం మల్టీప్లెక్స్, పాప్‌కార్న్ సినిమాలతో సరిపెట్టుకున్నాం.
అది అందరికీ చేరటం లేదు. అందరూ ఆ సినిమాలతో సంతోషపడ్డం లేదు. మల్టీప్లెక్స్ సినిమాలు చూసే వాళ్లకు జూనియర్ ఎన్టీఆర్ కొత్త కావచ్చు. కానీ, మాస్ ఆడియన్స్‌కు కాదు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమాకు ముందు ఓ వ్యక్తి నాతో ఏమన్నాడంటే ‘ అన్నా మీరు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను హర్యాణాలోని ఏ గ్రామానికైనా తీసుకెళ్లండి. వాళ్లను చూడ్డానికి జనం ఎగబడతారు. కానీ, హిందీ సూపర్ స్టార్లను చూడ్డానికి ఎవ్వరూ రారు. ఎందుకంటే వాళ్లు బాలీవుడ్ సినిమాలు చూడరు. డబ్బింగ్ ద్వారా మాస్ ఆడియన్స్ ఆ ఇద్దరి సినిమాలు చూస్తారు’ అని అన్నాడు. మనం క్రియేట్ చేసిన మెగాస్టార్లు నిజమైన మెగాస్టార్లు కాదు. మాస్ ఏరియాల్లో వాళ్లసలు హీరోలే కాదు’’ అంటూ సౌత్ సినిమాలను పొగడ్తలతో ముంచెత్తారు. మరి, మనోజ్ బాజ్‌పేయి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Pawan Kalyan: పక్కన తుపాకీతో మంచంపై పవన్ కళ్యాణ్ కునుకు.. ఫోటో వైరల్
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.