తమిళ చిత్రసీమకు సేవలు అందించిన అతికొద్ది బహుముఖ ప్రజ్ఞాశాలుల్లో మనోబాల ఒకరు. డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా, యాక్టర్‌గా ఆయన కళామతల్లికి సేవలు అందించారు. వైవిధ్యమైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు.
సినీ పరిశ్రమలో ఈమధ్య వరుస విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. అద్భుతమైన నటనా పటిమతో ఆకట్టుకునే తారల మరణాన్ని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవలే కోలీవుడ్ స్టార్ కమెడియన్, బహుముఖ ప్రజ్ఞాశాలి మనోబాల (69) కన్నుమూశారు. తమిళ చిత్రసీమలో కింది స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చిన ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా, నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా రాణించారు. తంజావూర్ జిల్లాలోని మరుంసూర్కు చెందిన మనోబాల.. 1953, డిసెంబర్ 8న జన్మించారు. ఆయన అసలు పేరు బాలచందర్. పెయింటింగ్‌కు సంబంధించిన విద్యను అభ్యసించిన మనోబాల.. ఆ తర్వాత చెన్నైకి చేరుకొని, భారతీరాజా దగ్గర సహాయ దర్శకుడిగా జాయిన్ అయ్యారు.
ఒకవైపు సహాయ దర్శకుడిగా పనిచేస్తూనే మరోవైపు పలు చిత్రాలకు డబ్బింగ్ ఆర్టిస్ట్‌గానూ వర్క్ చేశారు మనోబాల. ఆ తర్వాత నటన వైపు ఆయన అడుగులు వేశారు. ‘పుదియ వార్పుగళ్’ సినిమాలో చిన్నపాత్రలో కనిపించారు మనోబాల. అయితే సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ రూపొందించిన ‘పట్పుక్కాగ’ ఆయన్ను పూర్తిస్థాయి యాక్టర్‌ను చేసింది. నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాక దర్శకుడిగా అవతారం ఎత్తి ‘అకాయ గంగై’ చిత్రాన్ని తెరకెక్కించారు. అనంతరం సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఊర్క్కావలన్, విజయ్‌కాంత్‌తో ‘ఎన్ పురుస ఎన్ దాన్ ఎనక్కు మట్టుమ్దాన్’ లాంటి సక్సెస్ఫుల్ మూవీస్‌ను డైరెక్ట్ చేశారు మనోబాల.
తమిళ చిత్రసీమలో టాప్ దర్శకులుగా చెప్పుకునే కె.భాగ్యరాజ్, మణివన్నన్, మనోజ్‌కుమార్ లాంటి వారి సరసన చేరి.. మంచి సినిమాల డైరెక్టర్‌గా మనోబాల పేరు గడించారు. ఆ తర్వాత కాలంలో ఆయన హాస్యనటుడిగా ఒక ఊపు ఊపారు. అలాంటి మనోబాల మరణానికి ధూమపానమే కారణంగా తెలుస్తోంది. దర్శకత్వం చేసే రోజుల్లో స్మోకింగ్‌కు బానిసగా మారిన ఆయన.. రోజుకు 200 సిగరెట్లు పీల్చేసేవారని చెబుతారు. దీని వల్ల ఆయన కాలేయం తీవ్రంగా దెబ్బతిందట. కొన్ని నెలల కింద ఈ సమస్యతో ఆస్పత్రితో చేరి ట్రీట్మెంట్ పొందుతున్నారు మనోబాల. చికిత్స పొందుతున్న ఆయన బుధవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కొడుకు ఉన్నారు. మనోబాల మృతికి తమిళనాడు సీఎం స్టాలిన్, స్టార్ హీరోలు రజినీకాంత్, కమల్ హాసన్ తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.