లవ్, రిలేషన్, డేటింగ్, పెళ్లి, తర్వాత విడాకులు.. బాలీవుడ్‌లో ఈ వ్యవహారం మామూలే. గతకొంత కాలంగా అక్కడ సెలబ్రిటీల విడాకుల పర్వం కొనసాగుతోంది. కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులోనూ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు.
లవ్, రిలేషన్, డేటింగ్, పెళ్లి, తర్వాత విడాకులు.. బాలీవుడ్‌లో ఈ వ్యవహారం మామూలే. గతకొంత కాలంగా అక్కడ సెలబ్రిటీల విడాకుల పర్వం కొనసాగుతోంది. కొంతమంది సెలబ్రిటీలు లేటు వయసులోనూ రెండో పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. పర్సనల్ లైఫ్‌లో ఏర్పడ్డ అగాధం వల్ల ప్రొఫెషన్ పరంగా వెనుకబడడం, డ్రింక్, డ్రగ్స్ వంటి వాటికి అడిక్ట్ అయ్యి, అనారోగ్యం పాలయిన వారూ ఉన్నారు. అలాంటి వారి లిస్ట్‌లో సీనియర్ యాక్ట్రెస్ మనీషా కొయిరాలా పేరు కూడా ఉంది. హిందీతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా సత్తా చాటింది. నేపాల్‌లోని ఖాఠ్మండులో జన్మించిన మనీషా.. 1989లో ‘ఫేరి భతౌలా’ అనే నేపాలీ చిత్రంలో నటించింది. 1991లో సుభాష్ ఘై డైరెక్షన్‌లో వచ్చిన ‘సౌదాగర్’తో బాలీవుడ్‌లోకి అడుగు పెట్టింది.
ఆ తర్వాత ఆమె కెరీర్‌లో వెనకడుగు వేయలేదు. స్టార్ హీరోలందరితో సినిమాలు చేసింది. ఆమె చేసిన ‘బొంబాయి’ మూవీ అప్పట్లో సంచలన విజయం సాధించింది. తెలుగులో నాగార్జున సరసన ‘క్రిమినల్’, అర్జున్‌తో ‘ఒకే ఒక్కడు’, కమల్ హాసన్ ‘భారతీయుడు’, ‘బూచి’, ‘లేడీ టైగర్’ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటివలే కార్తీక్ ఆర్యన్ నటించిన ‘షెహాజాదా’లో హీరోకి తల్లి పాత్రలో నటించింది. మనీషాకి ఎంత మంచి పేరు వచ్చిందో అంతే త్వరగా ఆమె కెరీర్ ముగిసింది. ఆ టైంలో తన స్వస్థలం నేపాల్ తిరిగి వెళ్లాలని అనుకుంది. ఒంటరిగా ఉంటూ మద్యానికి బానిసైంది. మద్యం సేవించిన ఒక వీడియో నెట్టింట్లో కనిపించింది. మద్యం మత్తులో ఉన్న మనీషాను మీడియా ప్రతినిధులు ఫోటోలు తీస్తుండగా వద్దని వేడుకుంది.. మద్యానికి బానిస కావడం వల్ల జీవితంలో కష్టాలు పడ్డానని ఓ ఇంటర్వూలో చెప్పుకొచ్చింది.
మనీషా మాట్లాడుతూ.. ‘మద్యం నా లైఫ్‌లో వచ్చాక పరిస్థితి అంతా తలకిందులైంది. నా జీవితం ఇంతలా మారుతుందని అనుకోలేదు. మద్యానికి అలవాటు పడితే సమస్యలు పరిష్కారం కావు. జీవితంలో మన సంబంధాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. నా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా మందు తాగుతారు. మా నాన్న తాగేవాడు. కానీ పరిస్థితులని బట్టి మెలగాలి. అప్పుడే మన జీవితం హ్యాపీగా సాగుతుందని’ చెప్పుకొచ్చింది. కాగా 2010లో మనీషా తన తోటి నేపాలీ వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ని పెళ్లాడింది. కానీ రెండేళ్లకే వీరు విడాకులు తీసుకున్నారు.