స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పేరు చెప్పగానే అద్భుతమైన పాటలు, అంతకంటే అద్భుతమైన నేపథ్య సంగీతం గుర్తొస్తుంది. కానీ కొత్త వాళ్లు వచ్చినప్పుడు పాతవాళ్లకు అవకాశాలు తగ్గుతాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఇది మణిశర్మ జీవితంలోనూ జరిగింది. అయినా సరే ‘ఇస్మార్ట్ శంకర్’ లాంటి అదిరిపోయే ఆల్బమ్ ఇచ్చారు. ఈ సినిమా కోసం పూరీతో కలిసి పనిచేసిన మణిశర్మ.. ఆయన తర్వాత సినిమాకు కూడా కచ్చితంగా కలిసి వర్క్ చేస్తారని అందరూ అనుకున్నారు. కానీ రియాలిటీలో జరిగింది వేరు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేసిన ‘లైగర్’ సినిమా కొన్నాళ్ల ముందు థియేటర్లలోకి వచ్చింది. కారణాలు ఏమైనప్పటికీ… బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా ఫెయిలైంది. మొన్నటికి మొన్న పూరీ-డిస్ట్రిబ్యూటర్స్ మధ్య ఓ వివాదం కూడా జరిగింది. ఇదంతా పక్కనబెడితే.. మణిశర్మ ఇప్పుడు ‘లైగర్’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం బయటపెట్టారు. అసలు ఈ సినిమా ఎందుకు చేయలేకపోయానే రివీల్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
‘అలీతో సరదాగా’ షోకి హాజరైన ఆయన.. తన కెరీర్ కు సంబంధించిన అన్ని విషయాల గురించి మాట్లాడారు. ఈ క్రమంలోనే హోస్ట్ అలీ… పూరీ జగన్నాథ్ తో కలిసి ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా చేశారు కదా.. ఆ తర్వాత ‘లైగర్’ కోసం వద్దనుకున్నారా? తీసుకోలేదా? అని అలీ అడిగాడు. దీనికి సమాధానంగా కొన్ని కారణాలు ఉన్నాయని చెప్పి మణిశర్మ ఆపారు. ఇక ఆ మూవీ విషయంలో ఏం జరిగింది అనేది పూర్తిగా తెలియాలంటే మాత్రం ఫుల్ ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.