Mani Ratnam: పాన్ ఇండియా సినిమా ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రీకరణలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. భారీ తారగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమాను మణిరత్నం ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘పొన్నియన్ సెల్వన్’ సినిమా పోస్టు ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న మణిరత్నంకు కరోనా వైరస్ సోకింది. కరోనా పరీక్షల్లో ఆయనకు పాజిటివ్ వచ్చింది. దీంతో సోమవారం ఆయన చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చేరారు. వైద్యులు పర్యవేక్షణలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు.
కాగా, పొన్నియన్ సెల్వన్ సినిమా వివాదాల్లో చుక్కుకుంది. ఈ సినిమా టీజర్లోని పలు సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ డైరెక్టర్ మణిరత్నం, హీరో విక్రమ్‌లకు తాజాగా తమిళనాడులోని ఓ కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. ఈ చిత్రంలో చోళుల గురించి, చోళ రాజవంశం గురించి తప్పుగా చూపించారని ఆరోపిస్తూ సెల్వం అనే న్యాయవాది కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సినిమాలో విక్రమ్ పోషించిన పాత్ర ఆదిత్య కరికాలన్ నుదిటిపై తిలకం లేదని అన్నారు. కానీ, విక్రమ్‌కు సంబంధించిన పోస్టర్లో మాత్రం తిలకం ఉన్నట్లుగా చూపించారని, ఈ సినిమాలో చోళులను తప్పుగా చూపించారని సెల్వం ఆరోపిస్తున్నారు. మరి, మణిరత్నం కరోనానుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : Janhvi Kapoor: షోలో హీరోయిన్ జాన్వీ కపూర్ కి ఊహించని ప్రశ్న.. ఆమె ఏం చెప్పిందంటే?