పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడు మణిరత్నం.
మణిరత్నం.. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా గొప్ప గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించిన మణిరత్నం.. ప్రేమ కథలను మనసుకు హత్తుకునేలా తియ్యడంలో సిద్దహస్తుడు. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ట్రెండ్ సెట్టింగ్ సినిమాలను తెరకెక్కించాడు. ప్రస్తుతం పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడు. ఏప్రిల్ 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే రిలీజ్ కు మరికొన్ని రోజులు మాత్రమే ఉన్న సమయంలో మణిరత్నం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నియిన్ సెల్వన్ 2 పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమాను తెరకెక్కించాడు క్రియేటీవ్ డైరెక్టర్ మణిరత్నం. ఇక ఈ సినిమా తొలి భాగం తమిళ్ లో సూపర్ హిట్ సాధించింది. కానీ మిగతా భాషల్లో మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దాన్ని దృష్టిలో ఉంచుకున్న మణిరత్నం ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పీఎస్ 2 సినిమాకు సంబంధించి ఇప్పటికే తమిళంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేశాడు మణిరత్నం. కానీ మిగతా భాషల్లో ప్రమోషన్స్ ను మాత్రం ప్రారంభించలేదు. అసలు ప్రారంభించే ఆలోచన కూడా లేనట్లు తెలుస్తోంది. దానికి ఓ బలమైన కారణం కూడా ఉంది.
ఇక పీఎస్ 1 పాన్ ఇండియా లెవల్లో విడుదల అయినప్పటికీ.. ఒక్క తమిళంలోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. మిగతా భాషల్లో యావరేజ్ టాక్ తో లాభాలు సాధించలేకపోయింది. దాంతో ఈసారి కేవలం ఒక్క తమిళంలోనే ప్రమోషన్స్ చేపట్టాలని మణిరత్నం భావిస్తున్నాడట. అందుకే తెలుగుతో పాటుగా ఇతర భాషల్లో ప్రమోషన్స్ చేపట్టట్లేదు. ఇప్పటికే సినిమాపై భారీగా ఖర్చు చేయడంతో.. అంచనాలు లేని భాషల్లో ప్రమోషన్స్ కోసం మళ్లీ ఖర్చు చేయడం వేస్ట్ అన్న ఉద్దేశంతోనే మణిరత్నం ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. పాన్ ఇండియా సినిమా అని చెప్పుకుని ప్రమోషన్స్ పేరిట భారీగా ఖర్చు చేసి.. సినిమా బోల్తా కొడితే, ఆ ఖర్చులు కూడా రాక నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. ఇదే తప్పు తాను చెయ్యదలచుకోట్లేదు మణిరత్నం. అందుకే ఒక్క తమిళంలోనే ప్రమోషన్స్ ప్రారంభించాడు. మరి మణిరత్నం తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.