ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎందుకంటే.. అభిమాన హీరోలను ఎలాగో సినిమాలలో చూస్తూనే ఉంటాం. అదే హీరోల ఫ్యామిలీస్ గురించి ఎప్పుడోసారి వింటూ.. ఏవైనా అకేషన్స్ జరిగినప్పుడు విష్ చేస్తుంటారు. తెలుగు ప్రేక్షకులకు మంచువారి కోడలు విరానికా గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు తెలియనప్పటికీ.. హీరో మంచు విష్ణు భార్యగా అందరికీ సుపరిచితమే.
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీల ఫ్యామిలీస్ గురించి తెలుసుకునే ఆసక్తి ఫ్యాన్స్ లో ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఎందుకంటే.. అభిమాన హీరోలను ఎలాగో సినిమాలలో చూస్తూనే ఉంటాం. అదే హీరోల ఫ్యామిలీస్ గురించి ఎప్పుడోసారి వింటూ.. ఏవైనా అకేషన్స్ జరిగినప్పుడు విష్ చేస్తుంటారు. కానీ.. కొంతమంది హీరోల ఫ్యామిలీస్ కూడా ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్యాన్స్ కి అప్ డేట్స్, ఫ్యామిలీ ఫోటోలు షేర్ చేస్తూ ట్రీట్ ఇస్తుంటారు. అయితే.. తెలుగు ప్రేక్షకులకు మంచువారి కోడలు విరానికా గురించి పరిచయం అక్కర్లేదు. ఆమె వ్యక్తిగత విషయాలు తెలియనప్పటికీ.. హీరో మంచు విష్ణు భార్యగా అందరికీ సుపరిచితమే.
అమెరికాలో పుట్టి పెరిగిన విరానికా.. జ్యువలరీ, జెమాలజీ(రత్నాల శాస్త్రం), ఫ్యాషన్ మార్కెటింగ్ లో పట్టా అందుకొని.. విష్ణుతో పెళ్లయ్యాక ఇండియాకి వచ్చింది. మొదట్లో ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా తానే స్వయంగా జ్యువలరీ డిజైన్ చేసేదట విరానికా. ఇక కొన్నాళ్లకు ఇండియాలోనే తన పేరుతో బొటిక్ కూడా రన్ చేస్తోంది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు ఏకంగా లండన్ లో కొత్త బిజినెస్ ప్రారంభించి అందరినీ సర్ప్రైజ్ చేసింది మంచువారి కోడలు. వరల్డ్ లో అత్యంత కాస్ట్‌లీ ఏరియాలలో ఒకటిగా పేరొందిన ‘లండన్ హారోడ్స్’లో తన ఫ్యాషన్ స్టోర్ ని స్టార్ట్ చేసింది విరానికా. ఈ స్టోర్ కి ‘మైసన్ అవా’ అనే పేరు పెట్టడం విశేషం.
ఇక విరానికా స్టార్ట్ చేసిన ఈ స్టోర్ లో.. 2 సంవత్సరాల నుండి 14 ఏళ్ళ పిల్లల వరకు.. వారికి సంబంధించి దుస్తులు, ఫ్యాషన్ నీడ్స్ అన్నీ ఇందులో లభించనున్నాయట. అబ్బాయిలు, అమ్మాయిల కోసం స్పెషల్ గా డిజైన్స్.. చాలావరకు మిషన్ తో కాకుండా హ్యాండ్ మేడ్ డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయని ఆమె తెలిపారు. ప్రస్తుతం విరానికా లండన్ లో బిజినెస్ స్టార్ట్ చేయడంపై మీ మంచువారి ఫ్యాన్స్ తో పాటు.. కామన్ పీపుల్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అన్నట్లు విరానికాకి కూడా సోషల్ మీడియాలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక విరానికా తన కొత్త బిజినెస్ లో కూడా సక్సెస్ కావాలని నెటిజన్స్ విష్ చేస్తున్నారు. మరి మంచువారి కోడలు విరానికా నూతన బిజినెస్ గురించి, గృహిణిగా మిగిలిపోకుండా ఆమె బిజినెస్ లోనూ రాణిస్తున్న విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.