ఇటీవల ఇండియన్ ఆర్మీ విషయంలో వివాదాస్పద ట్వీట్ పెట్టి, క్షమాపణలు కోరిన బాలీవుడ్ నటి రిచా చడ్డాపై సోషల్ మీడియాలో విమర్శలు తగ్గట్లేదు. ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అంటూ రిచా చేసిన ట్వీట్ గాలివానలా అటు సినీ ఇండస్ట్రీలో, ఇటు సోషల్ మీడియాలో దుమారం రేపింది. ఈ విషయంపై ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, హీరోలు స్పందించిన సంగతి తెలిసిందే. అయితే.. రిచా చడ్డా ట్వీట్ పై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయినా వారిలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు ఒకరు. మరో యంగ్ హీరో నిఖిల్ కూడా రిచా ట్వీట్ పై స్పందించాడు. కానీ.. టాలీవుడ్ నుండి మొదట స్పందించింది మాత్రం మంచు విష్ణునే అని చెప్పాలి.
‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అనే రిచా ట్వీట్ పై మంచు విష్ణు స్పందిస్తూ.. ‘అసలు ఈమెకు ఏమైంది? అలా అనడానికి మీకు ఆలోచన ఎలా వచ్చింది? ఆర్మీ ఈ దేశానికి చేస్తున్న సేవలకు ప్రతి ఒక్కరూ వారిని పూజించాలి. కానీ.. రిచా చడ్డా లాంటి కృతజ్ఞత లేని భారతీయులను చూస్తుంటే బాధగా ఉంది’ అంటూ ట్వీట్ ద్వారా ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే.. మంచు విష్ణు పేరు వినగానే అందరూ అతన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడానికే చూస్తుంటారు. కానీ.. ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేస్తూ నటి రిచా చేసిన వివాదాస్పద ట్వీట్ పై.. ఫస్ట్ రియాక్ట్ అయిన తెలుగు హీరో విష్ణునే అని గ్రహించాలి.
అదీగాక గాల్వాన్ గురించి రిచా చేసిన వ్యాఖ్యలపై అందరూ స్పందించాల్సిన అవసరం ఉంది. తెలుగు నుండి స్టార్ హీరోలు స్పందించకపోయినా విష్ణు స్పందించి.. ఆమెకు బుద్దొచ్చేలా కౌంటర్ వేశాడు. మరి వేరే స్టార్స్ ఎందుకు స్పందించలేదు అనేది విషయం పక్కన పెడితే.. విష్ణు స్పందించడం మంచి విషయమనే చెప్పాలి. దేశవ్యాప్తంగా చర్చలకు దారితీసిన ఈ విషయంపై సామాన్యులకంటే సెలబ్రిటీలు రియాక్ట్ ఆయితే బాగుంటుందని భావిస్తుంటారు జనాలు. తనపై వచ్చే పర్సనల్ ట్రోల్స్ అన్నీ పట్టించుకోకుండా రిచా వివాదంపై విష్ణు ధైర్యంగా స్పందించడం విశేషం.
ఈ క్రమంలో మంచు విష్ణుని ట్రోల్ చేయాలని చూసేవారు ఇకపై ట్రోల్ చేసేముందు ఓసారి ఆలోచిస్తే బాగుంటుందని మంచు ఫ్యాన్స్ అంటున్నారు. రిచా చడ్డా ఇష్యూపై విష్ణు ధైర్యంగా స్పందించాడు కదా.. ఆ మాత్రం దమ్ము, ధైర్యం మిగతా హీరోలకు లేవా అని నెటిజన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే.. ఇదేదో హీరోలు రియాక్ట్ అవ్వట్లేదని బాధతోనో.. లేదా రియాక్ట్ అవ్వాలనే డిమాండ్ తోనో వాళ్ళు అడగట్లేదు. మంచు విష్ణు చేసిన ట్వీట్ కంటే.. టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోలు స్పందిస్తే.. ఆ ఇంపాక్ట్ వేరే లెవెల్ లో ఉంటుందని.. ఇష్యూపై స్పందించేందుకు మరికొందరు ముందుకు వస్తారనే ఉద్దేశంతోనే అంటున్నారు. అంతేగాక ఇకనైనా ట్రోల్స్ ఆపి సెల్యూట్ చేయాలని కామెంట్స్ వినిపిస్తున్నాయి. చూడాలి మరి గాల్వాన్ వివాదంపై ఎవరైనా స్టార్స్ రియాక్ట్ అవుతారేమో!
What is wrong with this woman???? How can you even imagine such a horrid line? Everyone in the armed forces should be worshipped if not anything else’s for their service to our great country. Just hurts to see such ungrateful Indians. pic.twitter.com/zOD5w9QZi7
— Vishnu Manchu (@iVishnuManchu) November 24, 2022