మా ఎన్నికలు కోసం తన ప్యానల్ సభ్యులు, అభిమానులతో కలిసి భారీ ర్యాలీతో నామినేషన్ వేశారు హీరో మంచు విష్ణు వర్ధన్ బాబు. బాణా సంచా, క్రాకర్స్ తో అట్టహాసంగా తరలి వచ్చి తన శక్తి చాటి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ ర్యాలీలో జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ కాజా సూర్యనారాయణ, యూసఫ్ గూడ లీడర్ శ్రీశైలం యాదవ్ విచ్చేసి విష్ణు మంచు కి మద్దతు తెలిపారు. కళాకారులు, విష్ణు సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులతో ఫిల్మ్ ఛాంబర్ ప్రాంగణమంతా కిక్కిరిసిపోయింది.
నిజానికి నిన్న ప్రకాష్ రాజ్ సాదా సీదా గా వచ్చి నామినేషన్ వేశారు. పాత, కొత్త సభ్యులందరిని కలుపుకుని పోయి అందరినీ ఒకే తాటిపైకి తెచ్చి ఈ ఎన్నికల ప్రక్రియ జరపబోతున్నట్లు విష్ణు వర్గీయులు బలంగా చెపుతున్నారు. ఇది మా విక్టరీకి సంకేతం. ఈ సెలెబ్రేషన్స్ ఇక నుండి రోజు జరుగుతాయి. తప్పకుండా విష్ణు గారి ప్యానల్ సభ్యులందరం అత్యధిక మెజారిటీతో గెలుస్తామని సభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక నామినేషన్ పూర్తయిన తరువాత విష్ణు మీడియాతో మాట్లాడారు. తన ప్యానల్ సభ్యులందరిని మీడియాకి పరిచయం చేశారు.
“10న ఎలెక్షన్స్ జరుగబోతున్నాయి. నాకు 900 మంది ఓటర్ల సభ్యులు సపోర్ట్ ఉంది. చిరంజీవి, పవన్ కళ్యాణ్ గారు అందరూ వచ్చి నాకు ఓట్ వేస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీ గురించి మాట్లాడారు. కానీ.., తెలుగు ఫిల్మ్ ఛాంబర్, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పవన్ మాటలతో ఏకీభవించలేదు. నేను కూడా ఆయన వ్యాఖ్యలతో ఏకీభవించను. ఇక ప్రకాష్ రాజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ తరుపునున్నారా? లేక పవన్ కళ్యాణ్ పక్కన ఉన్నారా.. అది ప్రకాష్ రాజ్ నే అడగాలి.
బండ్ల గణేశ్ చెప్తున్నట్టు మా ప్యానల్ నైట్ పార్టీస్ ఇవ్వడం లేదు. ఇవ్వదు కూడా. నేను నైట్ 9 గంటల కల్లా పడుకోవాలి. దానికి ముందు నా పిల్లల్ని నిద్ర పుచ్చాలి. మా ఆవిడ జాబ్ చేస్తుంది. సో మా ఆవిడ చేయాల్సిన పని నేను చేస్తున్నాను. ఇక నాకు నవంబర్ నుండి షూటింగ్ ఉంది.. నన్ను పార్టీస్ కి ఎవరూ పిలవట్లేదు.. నేను ఎవరికీ ఇవ్వట్లేదు” అని.. మంచు విష్ణు కామెంట్స్ చేశారు. మరి.. ఈసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో ఏ ప్యానల్ విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.