“మా” ఎన్నికలు ముగిసాయి. ఫలితాలు వచ్చేశాయి. కొత్త అధ్యక్షుడుగా మంచు విష్ణు ఎన్నిక కూడా అయ్యారు. కానీ.. “మా” లో వేడి మాత్రం ఇంకా తగ్గడం లేదు. తన ఓటమి తరువాత ప్రకాశ్ రాజ్ “మా” సభ్యత్వానికి రాజీనామా చేశారు. అంతకుముందే నాగబాబు కూడా ఇదే నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇక తరువాత వంతు శివాజీరాజాదిలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు మాత్రం ఎవ్వరి రాజీనామాలు ఆమోదించబోను అని తేల్చేశారు.
ఓడినా, గెలిచినా తామంతా “మా” కుటుంబ సభ్యులం అని తేల్చేశారు విష్ణు. అయితే.., ఇదే సమయంలో తనకి సపోర్ట్ ఇవ్వని మెగా ఫ్యామిలీపై కూడా విష్ణు కొన్ని హాట్ కామెంట్స్ చేశారు విష్ణు. ఇక్కడితో ఆగని విష్ణు.. ఇప్పటి వరకు “మా” రచ్చకి దూరంగా ఉంటున్న జూనియర్ యన్టీఆర్ ని సీన్ లోకి లాగారు మంచు విష్ణు.
“మా” ఎన్నికల్లో స్టార్ హీరోలు ఎవ్వరు తనకి అంతగా సపోర్ట్ చేయలేదని చెప్పిన విష్ణు.., జూనియర్ యన్టీఆర్ మాత్రం తనకి ఫోన్ చేసి అభినందించిన విషయాన్ని బయటపెట్టాడు. “మా ఎన్నికల్లో నేను విజయం సాధించిన తరువాత ముందుగా నాకు ఫోన్ చేసిన వ్యక్తి జూనియర్ యన్టీఆర్. నిజానికి తారక్ సపోర్ట్ పూర్తిగా నాకే ఉండింది. కాకుంటే.. కొన్ని ప్రత్యేక కారణాల వల్లే జూనియర్ ఓటింగ్ కి దూరంగా ఉండిపోయాడు అంటూ విష్ణు సంచలన కామెంట్స్ చేశారు. దీంతో.. ప్రకాశ్ రాజ్ ను వ్యతిరేకించిన వారి లిస్ట్ లో తారక్ చేరిపోయాడా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కానీ.. జూనియర్ యన్టీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో ఎలాంటి ఓపెన్ కామెంట్స్ చేయకపోవడం గమర్హం.