మూవీ ఆర్టీస్ట్ అసోసియేషన్ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతోంది. ఇక ఇప్పటికే ప్రకాష్ రాజ్ ను ప్రకటించగా ఇటీవల మా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న మంచు విష్ణుగా కూడా తన ప్యానెల్ ను కూడా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే మా ఎన్నికల నేపథ్యంలో హీరో మంచు విష్ణు మీడియా సమావేశంలో మాట్లాడారు. తెలుగు తెలుగు ఖ్యాతిని, ఆత్మగౌరాన్ని ఒకచోటు చేర్చేది సినిమా అని మంచు విష్ణు అన్నారు.
స్వర్గీయ దాసరి నారాయణ రావు, మురళి మెహన్ లాంటి పెద్దలు సినిమా ఇండస్ట్రీలోని మా ఎన్నికల్లో పోటీచేయాలని నాకు చెప్పారు. వాళ్లు అలా చెప్పిన కారణంగానే నేను మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నానని మంచు విష్ణు అన్నారు. నాపై నమ్మకం ఉంది కాబట్టే, నేను గొడ్డు చాకిరి చేస్తాననమే నమ్మకం ఉంది గనుకే నేను మా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నాను. మా అనేది చాలా బాధ్యతయుతమైనదిని, మా సంక్షేమం కోసం నేను పాటుపడతానని అన్నారు. ఇక ఎంతో మంది కొత్త కళాకారులు వస్తున్నారని, కొత్తవారికి కూడా అవకాశాలు రావాలని అన్నారు. ఇక మిగత ప్యానెల్ తో పోలిస్తే నా సభ్యుల ప్యానెల్ మా కు గొప్ప మార్పు తీసుకొస్తుందని నమ్మకముందని తెలిపారు. ఇక నేను నటుడు, నిర్మాతగానే కాకుండా ఓ మంచి విద్యావేత్తనని, విద్యా గురుంచి ఎలాంటి చర్చకైన సిద్దమని మంచు విష్ణు అన్నారు.