మంచు ఫ్యామిలీ నుంచి ఎలాంటి అప్‌డేట్స్ వచ్చినా సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలైపోతాయి. మంచు హీరోల నుంచి ఎప్పుడు అప్‌డేట్ వస్తుందా అని ట్రోలర్స్, మీమర్స్ కాచుక్కూర్చుంటారు. మంచు వారు మాట్లాడినా, మాట తడబడినా, సినిమాలు తీసినా, ఏ పని చేసినా సరే ఏదో ఒక లూప్‌హోల్ వెతికి మరీ ట్రోల్స్, మీమ్స్ వేస్తుంటారు. మోహన్ బాబు మాట్లాడిన ఫసక్ పదం గానీ, మంచు లక్ష్మి మాట్లాడిన నిలదీస్ఫై అనే పదం గానీ, మంచు విష్ణు మాట్లాడిన డ్యామ్ అనే పదం గానీ దేన్నీ వదల్లేదు. మా ఎలక్షన్స్ సమయంలోనూ, పలు సందర్భాల్లో మంచు విష్ణు మాట్లాడిన మాటలు, సన్నాఫ్ ఇండియా సినిమా ప్రమోషన్స్‌లో మోహన్ బాబు మాట్లాడిన మాటలు గానీ బాగా ట్రోలింగ్‌కి గురయ్యాయి. ఇప్పటికీ వీరు మాట్లాడిన పదాలని మీమ్స్‌గా వాడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్స్ హద్దు మీరడంతో ఆ మధ్య పరువు నష్టం దావా వేస్తున్నామని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు.
అయినప్పటికీ ట్రోలర్స్ ట్రోలింగ్స్ ఆపలేదు. ఆపకపోగా ఇంకా ఎక్కువగా ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ ట్రోలింగ్స్ నడుస్తుండగానే మరోసారి మంచు విష్ణు ట్రోలర్స్‌కి అవకాశం ఇచ్చారు. నడిరోడ్డు మీద మోకాళ్ళ మీద కూర్చుని ఒక స్టిల్ ఇచ్చారు. దాన్ని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో బాగా వైరల్ అవ్వడమే కాకుండా విపరీతంగా ట్రోలింగ్‌కి గురైంది. ఈ ఫోటోలో మంచు విష్ణు స్టిల్‌పై మీమ్స్ కూడా వదులుతున్నారు. ఈ ఫోటోని ఎడిట్ చేసి విపరీతంగా ఫన్ క్రియేట్ చేస్తున్నారు ట్రోలర్స్, మీమర్స్. ప్రస్తుతం మంచు విష్ణు జిన్నా సినిమా పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాని కూడా విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో తాము ఏం చేసినా ట్రోలర్స్ రెచ్చిపోతున్నారని మంచు ఫ్యామిలీ హీరోలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి మంచు ఫ్యామిలీ నటులపై వస్తున్న ట్రోలింగ్‌లపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.
🌴😏☀️ pic.twitter.com/hwj5EYwwQM
— Vishnu Manchu (@iVishnuManchu) August 23, 2022