ప్రముఖ నటుడు మంచు విష్ణు సంచలన విషయాలు బయటపెట్టేశాడు. తన లైఫ్‌లో చేసిన పొరపాటు, బిగ్గెస్ట్ మిస్టెక్ ఇదేనంటూ తాజాగా బయటపెట్టాడు. విషయం ఏంటంటే… ఓ ప్రముఖ ఛానెల్‌లో ఆలీతో సరదాగా అనే ప్రొగ్రామ్‌లో పాల్గొన్నాడు మంచు వారబ్బాయి మంచు విష్ణు. ఇందులో పాల్గొన్న ఆయన కొన్ని కీలకమైన అంశాలు చెప్పుకొచ్చాడు.
ఇక అలీ విష్ణుని ఇలా అడుగుతూ…మీరు కథ విని.. ఇది డ్యామ్ షూరు అనే చెప్పే సినిమాలు ఎన్ని ఉంటాయని అడగ్గానే..మంచు విష్ణు నా లైఫ్‌లో నేను చేసిన బిగ్గెస్ట్ మిస్టెక్ మంచి డైరెక్టర్‌లను ఎంపిక చేసుకోకపోవటమేనని మనసులో ఇన్నాళ్లు దాగి ఉన్న అంశాలను బయటపెట్టాడు. అలా ఇందులో నేను చేసిన పొరపాట్లు నాలుగు ఉన్నాయని తెలిపారు. అసలు మంచు మంచు విష్ణు చేసిన ఆ పొరపాట్లు ఏంటన్న దానిపై క్లారిటీ మాత్రం పూర్తిగా విడియో విడుదలయ్యాక తెలుస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు చేయటం పట్ల కొందరు అభిమానులు స్పందిస్తున్నారు.
మంచు విష్ణు కెరియర్ మొదట్లో మంచి డైరెక్టర్‌లను ఎంపిక చేసుకోవటంతో పొరపాటు చేశాడా? అన్న ప్రశ్నలు తలెత్తున్నాయి. ఇక మంచు విష్ణు తెలుగు చిత్ర పరిశ్రమకు రగిలే గుండెలు అనే మూవీలో బాల నటుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు హీరోగా మాత్రం విష్ణు, సూర్యం వంటి సినిమాల్లో నటించి అవార్డులు సైతం అందుకున్నాడు. ఇక తాజాగా విడుదలైన ఆలీతో సరదాగా ప్రోమో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.