ఇండస్ట్రీలో సినిమాల విషయంలోనైనా, వేరే ఏ విషయాలలో అయినా ఎప్పుడూ ట్రెండింగ్ లో ఉండే పేరు మంచు విష్ణు. ఎందుకంటే.. టాలీవుడ్ లో ఓవైపు హీరోగా సినిమాలు చేస్తూనే, మరోవైపు మా అసోసియేషన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. ఇక రెగ్యులర్ ఏదొక స్టేట్ మెంట్ తో వార్తల్లో నిలిచే మంచు విష్ణు.. తాజాగా సోషల్ మీడియాలో ఓ ఫోటో షేర్ చేసి అందరికి షాకిచ్చాడు. మరి విష్ణు షేర్ చేసిన ఫోటో విషయానికి వెళ్తే.. ప్రస్తుతం విష్ణు హీరోగా జిన్నా అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ముంబై బ్యూటీస్ సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ ఇద్దరూ విష్ణు సరసన హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే.. జిన్నా మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తూ, నటిస్తున్న మంచు విష్ణు.. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. ఫిజికల్ గా బాడీ ట్రాన్ఫర్ మేషన్ తో పాటు డ్యాన్స్ పరంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అందుకే ఈ మధ్య ఎక్కువగా జిమ్ లో వర్కౌట్ చేస్తున్న ఫోటోలు, వీడియోలు షేర్ చేస్తున్నాడు. అయితే.. ఇటీవల మంచు విష్ణు గాయపడ్డాడు. ఈ విషయాన్నీ తానే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ లో ప్రకటించాడు.
జిన్నా సినిమా కోసం డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డానని తెలిపిన విష్ణు.. తన గాయాన్ని చూపిస్తూ ఫోటో పోస్ట్ చేశాడు. అలాగే ఆ గాయానికి కారణమైన కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ మాస్టర్ కి థ్యాంక్స్ కూడా చెప్పడం విశేషం. అదీగాక డ్యాన్స్ విషయంలో తానెప్పుడూ ఇలా గాయపడలేదని.. అయినా తాను డ్యాన్స్ ని ఎంజాయ్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం మంచు విష్ణు గాయపడిన ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది. మరి మా అధ్యక్షుడు మంచు విష్ణు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.