ఈమధ్య కాలంలో మంచు కుటుంబం తరచుగా వార్తల్లో నిలుస్తోంది. ఇక తాజాగా మరో సారి మంచు ఫ్యామిలీకి సంబంధించిన వార్త ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకు ఏం జరిగింది అంటే..
మంచు కుటుంబంలో ఏం జరిగినా.. అది పెద్ద న్యూసే అవుతుంది. ఇక గత కొన్ని రోజులుగా మంచు కుటుంబం.. నిత్యం వార్తల్లో నిలుస్తోన్న సంగతి తెలిసిందే. మనోజ్ రెండో వివాహం చేసుకోవడం, విష్ణు ఈ పెళ్లికి దూరంగా ఉండటం.. వంటి అంశాలు సంచలనంగా మారాయి. ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ గొడవపడిన వీడియో తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. విష్ణు ఒకరి ఇంటి మీదకు గొడవకు వెళ్లడం.. మనోజ్ తన గురించి కామెంట్స్ చేయడం.. మోహన్ బాబు స్పందన వైరల్‌గా మారాయి. కట్ చేస్తే.. ఇవన్ని ఓ షో కోసమంటూ చేసిన ప్రకటన కూడా అంతే వైరలయ్యింది. వాళ్లు నిజంగానే గొడవపడ్డారా.. లేక ప్రాంకా అన్నది తెలియలేదు. ఇక తాజాగా మరోసారి మంచు కుటుంబం వార్తలో నిలిచింది. తండ్రికి కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన బహుమతి ఇచ్చాడు విష్ణు. ఆ వివరాలు..
మంచు విష్ణు.. తన తండ్రి మోహన్ బాబుకు 5 కోట్ల రూపాయల ఖరీదైన బహుహతి ఇచ్చాడనే వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. మార్చి 19న మోహన్ బాబు పుట్టినరోజు. చాలా గ్రాండ్‌గా బర్త్‌డే వేడుక నిర్వహించారు. ఇక పుట్టిన రోజు సందర్భంగా మంచు విష్ణు తన తండ్రికి ఆ రోజు భారీ సర్ ప్రైజ్ ఇచ్చాడట. బర్త్‌డే రోజున మోహన్ బాబుకు ఖరీదైన రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ ఎస్‌యూవీని విష్ణు గిఫ్ట్‌గా ఇచ్చాడని వార్తలు షికారు చేస్తున్నాయి. ఈ కస్టమ్ మేడ్ రేంజ్ రోవర్ ఆటోబయోగ్రఫీ విలువ. రూ. 5.25 కోట్లు అని సమాచారం. అయితే మంచు ఫ్యామిలీ మాత్రం ఇప్పటి వరకు ఈ కారు స్పెసిఫికేషన్స్, ఖరీదు గురించి ఎక్కడా మాట్లాడలేదు.
ఇక మోహన్ బాబు దగ్గర ఉన్న కారు కలెక్షన్‌లో ఆడి క్యూ7, రేంజ్ రోవర్ వోగ్, టయోటా ఫార్చ్యూనర్‌లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాస్ట్‌లీ కారు కూడా ఆ జాబితాలో చేరిందన్నమాట. ఆలస్యంగా బయటకు వచ్చిన ఈ వార్త నిజమో కాదో స్పష్టంగా తెలియదు. ఇక ప్రస్తుతం మోహన్ బాబు శాకుంతలం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. సమంత ‘శాకుంతలం’ సినిమాలో దుర్వాస మహర్షిగా మోహన్ బాబు కనిపించారు. అలానే విష్ణు ఇటీవల ‘హౌస్ ఆఫ్ మంచు’ అనే రియాల్టీ షోను ప్రకటించారు. మంచు మనోజ్ ఈ మధ్యే పెళ్లి చేసుకోవడంతో ప్రస్తుతం షూటింగ్‌లకు కాస్త విరామం ఇచ్చాడు.