మంచు విష్ణు.. ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో జిన్నా సినిమా పేరు వినిపిస్తోంది. మంచు విష్ణు, సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ లీడింగ్ రోల్స్ ఈ సినిమాని పాన్ ఇండియా లెవల్లో నిర్మిస్తున్నారు. సోషల్ మీడియా, ఫిల్మ్ వర్గాల్లో ఈ సినిమాకి మంచి బజ్ నడుస్తోంది. చాలా గ్యాప్ తర్వాత మంచు విష్ణు వెండితెరపై సందడి చేయనున్నాడు. అదికూడా పాన్ ఇండియా సినిమాతో వస్తుండటంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. ఈ సినిమా నిజానికి అక్టోబర్ 5న దసరా సందర్భంగా విడుదల కావాల్సి ఉంది. కానీ, గాడ్ ఫాదర్, ఘోస్ట్ సినిమాలు ఉండటంతో జిన్నా సినిమాని వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా జిన్నా సినిమా విడుదల కానుంది.
ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్, ట్రైలర్, టీజర్‌లు అన్నీ ప్రేక్షకులను అలరించాయి. తాజాగా ఈ సినిమా నుంచి జారు మిఠాయా అనే సాంగ్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఆ సాంగ్ యూట్యూబ్‌లో తెగ వైరల్ అవుతోంది. మంచు విష్ణు- సన్నీ లియోన్ వేసిన స్టెప్పులకు ఫ్యాన్స్ ఊగిపోతున్నారు. అంతేకాకుండా మంచు విష్ణు డెడికేషన్‌కు నెట్టింట మంచి మార్కులు పడుతున్నాయి. మంచు విష్ణు పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు సాధించడం కోసం చాలా కష్టపడుతున్నాడని చెబుతున్నారు. అంతేకాకుండా డాన్స్ పరంగానూ విష్ణు చాలా మెరుగైనట్లు కితాబిస్తున్నారు. ఈ పాట విడుదలైన తర్వాత సినిమాపై అంచనాలు మరింత పెరిగాయంటూ చెబుతున్నారు.
Here is My Fav Dance Number #𝐉𝐚𝐫𝐮𝐌𝐢𝐭𝐚𝐲𝐚💥 lyrical from #𝔾𝕀ℕℕ𝔸🔥 with the one and only Hottest!
Play▶️ https://t.co/RBhIjyEsgV@SunnyLeone @starlingpayal #GinnaBhai🔥 #GinnaOn21stOct💥 @saregamasouth pic.twitter.com/R5MxPdtjia
— Vishnu Manchu (@iVishnuManchu) October 10, 2022
అంతేకాకుండా మంచు విష్ణు డాన్స్ మూమెంట్స్ వీడియో కట్ చేసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సాంగ్‌తో కంపేర్ చేసి వీడియో వైరల్ చేస్తున్నారు. డాన్స్ లో మంచు విష్ణు ఎంతో ఇంప్రూవ్ అయ్యాడని చెప్పేందుకు ఈ క్లిప్ చాలంటూ కామెంట్ చేస్తున్నారు. బద్రీనాథ్ సినిమాలోని నాథ్ నాథ్ నీలో బద్రీనాథ్ సాంగ్‌లో ఒక మ్యూజిక్ బిట్ ఉంటుంది. దానికి బన్నీ ఆగకుండా తన మూవ్స్ తో అందరినీ మెస్మరైజ్ చేశాడు. ఇప్పుడు సేమ్ అలాంటి మూమెంట్స్ తో మంచు విష్ణు కూడా ప్రేక్షకులను అలరించనున్నాడు. అల్లు అర్జున్- మంచు విష్ణులను పక్క పక్కన పెట్టి ఆ ట్రాక్, జారు మిఠాయా ట్రాక్ యాడ్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో కూడా యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. మరి.. ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి.