మంచు విష్ణు ఈ మధ్య సినిమాలు తగ్గించి ఆచీ తూచి అడుగులు వేస్తున్నాడు. అయితే చాలా కాలం తర్వాత విష్ణు ‘గాలి నాగేశ్వర రావు’ అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తుండగా ఏవా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్‌లో మంచు విష్ణు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విష్ణు సరసన శృంగార తార సన్నీలియోన్ తో పాటు హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ కలిసి నటిస్తున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అయితే షూటింగ్ కు కాస్త గ్యాప్ దొరికితే చాలు ఈ సమయంలో ఇద్దరు హాట్ హీరోయిన్స్ తో విష్ణు తెగ అల్లరి చేస్తున్నాడు. తాజాగా షూటింగ్ గ్యాప్ లో సన్నీలియోన్, పాయల్ తో విష్ణు ఫన్నీ గేమ్స్ ఆడుతున్నాడు. అయితే ఇక తాజాగా షూటింగ్ గ్యాప్ దొరకడంతో సన్నీలియోన్, పాయల్ రాజ్ పుత్ విష్ణు కలిసి సరదాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో విష్ణుకి కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ముందుగా మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అని అడగగా.. పాయల్ రాజ్ పుత్ మై ఫేవరెట్ హీరోయిన్ అంటూ సరదగా సమాధానిమిచ్చాడు.
ఇది కూడా చదవండి: Manchu Vishnu: షూట్ గ్యాప్ లో మంచు విష్ణు- పాయల్ అల్లరి.. ఫొటోస్ వైరల్!
ఇక ఆ తర్వాత మీ ఫేవరెట్ ఎవరు అని అడగగా.. సన్నీలియోన్ మై ఫేవరెట్ అంటూ మంచు విష్ణు ఆన్సర్ ఇచ్చాడు. ఇక ఇదే కాకుండా పాయల్, సన్నీలియోన్ ఇద్దరి పక్క పక్క కూర్చొని ఉండగా ఇద్దరిలో మీ ఫేవరెట్ ఎవరని అడగగా విష్ణు ఆలియా భట్ అని చెప్పడంతో పాయల్, సన్నీలియోన్ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఆలియా పేరు చెప్పడంతో ఇద్దరు బామలు విష్ణుని తరిమి తరిమి కొట్టారు. సరదాగా సాగిన ఈ ఇంటర్వ్యూ వీడియోను సన్నీలియోన్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో కాస్త వైరల్ గా మారింది. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
Tag that friend who is like @iVishnuManchu 😂😂 Hope he learnt his lesson 🤕 pic.twitter.com/kzXOi2mCvY
— Sunny Leone (@SunnyLeone) May 11, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.