టాలీవుడ్ హీరో, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు ఏం చేసినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం అనేది మామూలే. రెగ్యులర్ గా ట్రోల్స్ కి గురయ్యే సెలబ్రిటీలలో విష్ణు పేరు ఎప్పుడూ వినిపిస్తుంటుంది. అయితే.. ఎందుకు మంచు విష్ణు ట్రోల్స్ కి గురవుతుంటాడు? అనే సందేహం అందరికి వస్తుంది. అందుకు కారణం కూడా లేకపోలేదు. సోషల్ మీడియాలో విష్ణు పెట్టే పోస్టులు ఓ కారణం కాగా, మూవీ అసోసియేషన్ అధ్యక్షుడిగా విష్ణు ఇచ్చే స్టేట్ మెంట్స్ మరో కారణమని నెటిజన్స్ అంటున్నారు. కానీ.. ఎవరేం అనుకున్నా తాను చేయాలనున్నదే చేస్తూ వార్తల్లో నిలుస్తుంటాడు విష్ణు.
తాజాగా మంచు విష్ణు మరోసారి ఓ క్రేజీ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేసి హాట్ టాపిక్ గా మారాడు. విష్ణు ప్రస్తుతం ‘జిన్నా’ అనే పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు సరసన బాలీవుడ్ బ్యూటీ సన్నీ లియోన్, పాయల్ రాజపుత్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అయితే.. ఈ సినిమాకు సంబంధించి ఏ అప్ డేట్ అయినా విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. అలాగే తాను పర్సనల్ వర్కౌట్స్, జిమ్ సెషన్స్ గురించి కూడా అప్పుడప్పుడు ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తుంటాడు. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా తనను తాను ఓ బుల్డోజర్(దున్న)తో పోల్చుకున్నట్లుగా పోస్ట్ పెట్టి సర్ప్రైజ్ చేశాడు.
ఓ బుల్డోజర్ పిక్ షేర్ చేస్తూ.. “నేను పది పుషప్స్ చేసినప్పుడల్లా నన్ను నేను ఆ బుల్డోజర్(దున్న)లా ఊహించుకుంటా” అని పోస్ట్ లో క్యాప్షన్ జోడించాడు. ఇంకేముంది టైంకి దొరికాడు అన్నట్లుగా నెటిజన్స్ విష్ణుపై, ఆయన షేర్ చేసిన పిక్ పై ట్రోల్స్ స్టార్ట్ చేసేశారు. అయితే.. విష్ణు ఉద్దేశంలో పది పుషప్స్ తర్వాత తన బాడీ బుల్డోజర్ మారుతుందన్న ఫీలింగ్ వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ.. అది నెటిజన్స్ కి మరోలా అర్థమై నెగటివ్ కామెంట్స్ తో సోషల్ మీడియా అంతా రచ్చ చేస్తున్నారు. అలాగే మరోవైపు విష్ణు ప్రధాని నరేంద్ర మోడీకి సైతం బర్త్ డే విషెస్ తెలిపాడు. ప్రస్తుతం విష్ణు పోస్టులు నెట్టింట తెగవైరల్ అవుతున్నాయి. మరి మంచు విష్ణు గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
This is how I imagine I am after I do ten push ups. 😊 pic.twitter.com/YvqadZBZtH
— Vishnu Manchu (@iVishnuManchu) September 17, 2022