సన్నీ లియోనీ పేరు చెబితే చాలు కుర్రాళ్లు వెర్రెక్కిపోతారు. యువతలో ఆమె ఫాలోయింగ్ అలాంటిది. ఇక ఆమె సినిమా వస్తుందంటే చాలు అలెర్ట్ అయిపోతారు. సన్నీ క్రేజ్ అలాంటిది. హిందీలో అడపాదడపా సినిమాలు చేసిన సన్నీ లియోనీ.. తెలుగులో కరెంట్ తీగ, గరుడవేగ సినిమాల్లో నటించింది. ప్రస్తుతం మంచు విష్ణు హీరోగా చేస్తున్న ‘జిన్నా’లో ఓ హీరోయిన్ గా చేసింది. పోస్టర్ అవి చూసినప్పుడే ఈ సినిమాపై సోషల్ మీడియాలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పుడు హీరో మంచు విష్ణు-సన్నీ లియోనీ మధ్య జరిగిన ఫన్నీ సంభాషణ నెటిజన్స్ ని ఆహా అనుకునేలా చేస్తోంది.
ఇక వివరాల్లోకి వెళ్తే.. మంచు విష్ణు ‘జిన్నా’ టీజర్ ను శుక్రవారం రిలీజ్ చేశారు. ఇందులో విష్ణు.. టెంట్ హౌస్ ఓనర్ రోల్ చేయగా, పాయల్ రాజ్ పుత్ విలేజ్ అమ్మాయిగా నటిస్తుంది. సన్నీ లియోనీ విలేజ్ లో అడుగుపెట్టిన మోడ్రన్ భామలా కనిపించింది. ఈ సినిమాని హాస్యంతోపాటు హారర్ ఎలిమెంట్స్ కూడా మిక్స్ చేసి తీసినట్లు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. అందులో సన్నీ, విష్ణుని మెచ్చుకుంది. తనతో కలిసి పనిచేయడం బాగుందని అని చెప్పింది. దీంతో ఫన్నీగా రియాక్ట్ అయిన విష్ణు.. ముద్దిస్తావా అని స్టేజీపైనే సన్నీని అడిగేశాడు. అక్కడున్న వారందరూ తెగ నవ్వుకున్నారు. ఈ విషయం కాస్త వైరల్ గా మారింది. మరి విష్ణు-సన్నీ కిస్ సంభాషణపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో పోస్ట్ చేయండి.
ఇదీ చదవండి: ఆ బాలీవుడ్ స్టార్స్ నాతో కలిసి నటించేందుకు ఇష్టపడరు: సన్నీలియోన్