తెలుగు చిత్ర పరిశ్రమలో దాసరికి ప్రత్యేక స్థానం ఉండేది. అజాత శత్రువుగా, తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్నగా దాసరి అందిచిన సేవలు, ఇండస్ట్రీ అభివృద్ధికి చేసిన కృషి ఎనలేనిది. దాసరి కాలం చేసిన తర్వాత ఇండస్ట్రీలో ఆ లోటు స్పష్టంగా తెలుస్తోంది. కుటుంబానికి పెద్ద లేకపోతే ఎలా అయితే చెట్టుకొకరు, పుట్టకొకరు అవుతారో అలాంటి పరిస్థితే తెలుగు చిత్ర పరిశ్రమలో కనిపిస్తోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేయాలి? చేస్తారు? అనే ప్రశ్నలు బాగా వినిపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల సందర్భంగా జరిగిన పరిణామాలు చూసి తప్పకుండా పెద్దన్న ఉండాలనే అభిప్రాయాలు కూడా ఊపందుకున్నాయి.
మెగాస్టార్‌గా చిరంజీవి స్థానాన్ని ప్రశ్నించేవారు లేరు. సమాజానికి, సినిమా పరిశ్రమకు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అందుకే చిరంజీవి ఆ స్థానాన్ని తీసుకోవాలని కొందరు కోరుకుంటున్నారు. పలు సందర్భాల్లో వారి అభిప్రాయాన్ని బాహాటంగానే వెల్లడించారు. ‘మా అన్నయ్య ఎప్పుడూ పెదరాయుడులా పెద్దరికం చేయాలనుకోలేదు’ అంటూ నాగబాబు చేసిన వ్యాఖ్యలతో ఆ వర్గం కాస్త వెనక్కి తగ్గింది.
ఇదీ చదవండి: అభిమానులకు సమంత బిగ్ సర్‌ప్రైజ్.. ఏం చేయబోతోందంటే?
మంచు విష్ణుని ‘మా’ అధ్యక్షుడి రేసులో నించుబెట్టి.. అతడు అధ్యక్షుడిగా గెలిచే దాకా వెనకుండి చక్రం తిప్పింది కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు అనడంలో ఎలాంటి అనుమానం లేదు. దాసరి శిష్యుడిగా ఆయన స్థానాన్ని మోహన్ బాబు భర్తీ చేయాలని కోరుకునే వారు కూడా లేకపోలేదు. మీడియా ముఖంగా ఆ విషయాన్ని నరేశ్ కూడా ప్రస్తావించాడు. తెలుగు చిత్ర పరిశ్రమకు మీరు పెద్దన్నగా ఉండాలి అంటూ మోహన్ బాబును కోరిన విషయం తెలిసిందే. ఆ విషయంలో అప్పటికి మోహన్‌బాబు సుముఖత వ్యక్తం చేయకపోయినా.. ఆయన మనసులో ఆ భావన ఉంది అనే అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. సినిమా ఇండస్ట్రీనే కాదు.. సమాజంలోనూ మంచు కుటుంబానికి మంచి ఇమేజ్ ఉంది. ఆయన ఆ స్థానాన్ని భర్తీ చేస్తాను అని ముందుకొస్తే అడ్డుపడే వారు కూడా పెద్దగా ఉండరు అంటూ చెప్తున్నారు.
గత కొన్ని రోజులుగా మోహన్ బాబు తన స్వభావానికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారంటూ అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ‘మా’ ఎన్నికల సందర్భంగా విష్ణును గెలిపించాలంటూ అందరికీ స్వయంగా ఫోన్ చేసిమరీ మోహన్ బాబు కోరిన సంగతి తెలిసిందే. బాలకృష్ణను సైతం కలిసి ముచ్చటించడం కూడా గమనార్హం. మరోవైపు తెలుగు ఇండస్ట్రీలో పెద్దలైన కృష్ణ, కృష్ణంరాజులను కూడా కలిసి విష్ణును ఆశీర్వదించాలని కోరారు. ఈ పరిణామాలు అన్నీ చూస్తుంటే మోహన్ బాబు చెప్పకనే తన మనుసులో ఉన్న విషయాన్ని చెప్పాలనుకుంటున్నారు అని టాక్ వినిపిస్తోంది. మోహన్ బాబు తెలుగు ఇండస్ట్రీకి పెద్దన్న అయితే బావుంటుందా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.