రెండో పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్.. తొలిసారి ఓ ఇంటర్వ్యూలో జంటగా కనిపించాడు. ఇప్పటివరకు ఎవరికీ తెలియని చాలా విషయాల్ని షేర్ చేసుకున్నాడు.
మంచు ఫ్యామిలీ- సోషల్ మీడియా దాదాపు కలిసే ఉంటాయి. ఎందుకంటే మోహన్ బాబుతో పాటు ఆయన వారసులు విష్ణు, మంచు లక్ష్మీ.. ఎప్పటికప్పుడు ట్రెండింగ్ లోనే ఉంటారు. అలా ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీలో రెండు సంఘటనలు జరిగాయి. మంచు మనోజ్.. భూమా మౌనికని రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నిరోజులకే మనోజ్-విష్ణు గొడవపడినట్లు ఓ వీడియో తెగ సర్క్యూలేట్ అయింది. మ్యారేజ్ రియల్ గానే జరిగింది. ఆ గొడవ మాత్రం ఓ రియాలిటీ షో కోసం ప్లాన్ చేశారు. దీంతో మంచు ఫ్యామిలీలో అసలు ఏం జరుగుతుంది తెలుసుకుందామంటే.. ఒక్కరూ కూడా బయట కనిపించట్లేదు. ఇప్పుడు మనోజ్ మాత్రం పెళ్లి తర్వాత భార్య మౌనికతో కలిసి తొలిసారి బయటకొచ్చాడు. చాలా ఆసక్తికర విషయాల్ని షేర్ చేసుకున్నాడు.
ఇక విషయానికొస్తే.. హీరో మనోజ్ పేరు చెప్పగానే బిందాస్, వేదం, కరెంట్ తీగ లాంటి సినిమాలు గుర్తొస్తాయి. హీరోగా ఎక్కువగా యావరేజ్ మూవీస్ తీశాడు. కాస్తోకూస్తో పేరు తెచ్చుకున్నాడు. చివరగా 2018లో ఓ మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. అప్పటినుంచి యాక్టింగ్ చేయట్లేదు. బయట ఎక్కడా కనిపించడమే మానేశాడు. దీంతో అందరూ ఏమైంది ఏమైంది? అనుకున్నారు. భార్య ప్రణతి రెడ్డికి 2019లో విడాకులు ఇచ్చేశాడు. దీంతో మనోజ్ లైఫ్ లో అసలేం జరుగుతుందిరా బాబు అని నెటిజన్స్ తలో రకంగా మాట్లాడుకున్నారు. సడన్ గా ఏడాది ఏడాదిన్నర క్రితం.. భూమా మౌనికతో కనిపించాడు. దీంతో వీరిద్దరి మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్ అనే రూమర్స్ వచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాజాగా వీళ్లు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈటీవీలో ‘అలా మొదలైంది’ టాక్ షోలో జంటగా పాల్గొన్నారు. తన స్టోరీ గురించి బయటపెట్టారు.
ఫస్ట్ మాట్లాడిన మౌనిక.. ‘అమ్మ చనిపోయాక.. ఆమె పుట్టినరోజున అలా ఆకాశం వైపు చూస్తూ, ఎక్కడున్నావ్? నాకేం కావాలో నీకు తెలుసు. అంతా నీకే వదిలేస్తున్నాను అని అనుకున్నాను. ఆరోజు మనోజ్ ఆళ్లగడ్డకి వస్తాడని అనుకోలేదు. నా లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేను’ అని ఎమోషనల్ అయింది. తర్వాత మనోజ్ మాట్లాడుతూ.. ‘వెళ్లాలి, అక్కడే ఉండాలని మనమే ఊహించుకుని.. అక్కడికి వెళ్లి సాయం చేయాలనుకున్నప్పుడు ఇబ్బందులు పడ్డాను. అనుకున్నట్లే ప్రేమించాను. కానీ ప్రేమ రెండు వైపులా ఉండాలి. ఎటుపక్క నిలబడుతున్నావో.. ఎక్కడున్నావో ఏం అర్థం కాలేదు. సరే నీకు లవ్ లైఫ్ కావాలా? సినిమా కావాలా సెలెక్ట్ చేసుకో అనే పరిస్థితి వచ్చింది. మనల్ని నమ్ముకుని బిడ్డతో ఓ అమ్మాయి లైఫ్ నిలబడింది నాకోసం. తనకు ద్రోహం చేస్తే ఈ జన్మకు నేను బతికి వేస్ట్ అనుకున్నాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ప్రోమో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మనోజ్ వ్యాఖ్యలపై మీరేం అంటారు. కింద కామెంట్ చేయండి.