సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ లో కాస్తైనా ఆసక్తి కనిపిస్తుంది. కనీసం సెలబ్రిటీని చేసుకుంటున్న పెళ్లికూతురు/పెళ్లి కొడుకు ఎవరు? వారి వివరాలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికైనా కాస్త దృష్టి పెడుతుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో మంచు మనోజ్ పెళ్లి చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా సెలబ్రిటీల పెళ్లి జరుగుతుందంటే.. ఫ్యాన్స్, కామన్ ఆడియెన్స్ లో కాస్తైనా ఆసక్తి కనిపిస్తుంది. కనీసం సెలబ్రిటీని చేసుకుంటున్న పెళ్లికూతురు/పెళ్లి కొడుకు ఎవరు? వారి వివరాలేంటి? అనే విషయాలు తెలుసుకోవడానికైనా కాస్త దృష్టి పెడుతుంటారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరో మంచు మనోజ్ పెళ్లి చర్చనీయాంశంగా మారింది. మనోజ్ మార్చి 3న భూమా మౌనికని రాత్రి 8:30 గంటలకు పెళ్లి చేసుకోబోతున్నాడు. మౌనిక పెళ్లికూతురుగా రెడీ అయిన ఫోటో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసి ట్విస్ట్ ఇచ్చాడు మనోజ్. కాగా.. వీరి పెళ్లి అతికొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తోంది. దీంతో మనోజ్ – మౌనిక దంపతులకు సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తుతున్నాయి.
కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరి పెళ్లి.. ఫిలిం నగర్ లోని మంచు లక్ష్మి ఇంట్లో జరగనుందని సమాచారం. ఈ క్రమంలో మనోజ్ – మౌనికలకు సంబంధించి ఓ ఓల్డ్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటంటే.. వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. మొదటి పెళ్లి జరిగిపోయి.. విడాకులు తీసుకున్న తర్వాత వీరు ప్రేమలో పడ్డారని తెలుస్తోంది. ఇలాంటి తరుణంలో భూమా మౌనిక మొదటి పెళ్లికి మనోజ్ గెస్ట్ గా వెళ్లిన ఫోటో.. ప్రెజెంట్ హాట్ టాపిక్ గా మారింది. దీంతో సోషల్ మీడియాలో మనోజ్, మౌనికల రెండో పెళ్లి గురించి విషెష్ తో పాటు కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. మనోజ్ తన రెండో పెళ్లి విషయంలో ఇటీవల పెళ్లి చేసుకున్న ఓ స్టార్ హీరోయిన్ ని ఫాలో అయ్యాడేమో అంటున్నారు.
ఇంతకీ మనోజ్ ఫాలో అయ్యాడంటున్న హీరోయిన్ ఎవరో తెలుసా! హన్సిక. ఇటీవలే సోహైల్ ఖాతూరియాని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. గతేడాది వీరి పెళ్లి గ్రాండ్ గా జరిగింది. అయితే.. హన్సికకి, మనోజ్ కి లింకేంటీ? అనంటే.. హన్సిక కూడా 2016లో సోహైల్ ఖాతూరియా మొదటి పెళ్లికి గెస్ట్ గా వెళ్ళింది. ఆ పెళ్లికూతురు కూడా హన్సిక బెస్ట్ ఫ్రెండ్ కావడం గమనార్హం. కొన్నాళ్ళకు సోహైల్ మొదటి భార్యతో విడిపోయాక.. అతడిని ప్రేమించి పెళ్లాడింది హన్సిక. అదే విధంగా మనోజ్.. 2015లో భూమా మౌనిక పెళ్ళికి గెస్ట్ గా వెళ్ళాడు. కట్ చేస్తే.. అదే మౌనిక భర్తతో విడిపోయాక ప్రేమించి.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా.. హన్సికని మనోజ్ ఫాలో అయ్యాడని నెటిజన్స్ అభిప్రాయం. పైగా రెండో పెళ్లి అంటే.. వేరే వాళ్ళను చేసుకోవడం చూశాం. కానీ.. ఇలా ముందు గెస్ట్ గా వెళ్లి.. తర్వాత వాళ్లనే పెళ్లాడటం అనేది ఎప్పుడూ చూడలేదని అంటున్నారు. ప్రస్తుతం మనోజ్ – మౌనికల పెళ్లి విషయం వైరల్ అవుతోంది. మరి మనోజ్, మౌనికల పెళ్లిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.
Pellikuthuru @BhumaMounika ❤️#MWedsM #ManojWedsMounika 🙏🏼❤️ pic.twitter.com/eU6Py02jWt
— Manoj Manchu🙏🏻❤️ (@HeroManoj1) March 3, 2023
Pellikoduku♥️@HeroManoj1@BhumaMounika#MWedsM #ManojWedsMounika pic.twitter.com/NDAzG7O3Ab
— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) March 3, 2023
#Hansika Weds her long time Friend and Business partner #Sohail #HansikaMotwanipic.twitter.com/Ckru1CiGUE
— OverSeasRights.Com (@Overseasrights) December 6, 2022