మంచు మనోజ్-భూమా మౌనికల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో.. అతి కొద్ది మంది బంధువులు సమక్షంలో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి. ఆ వివారలు..
పుకార్లకు చెక్ పెడుతూ.. మంచు మనోజ్-భూమా మౌనిక వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మంచు వారి కుటుంబ సభ్యులు, భూమ కుటుంబ సభ్యుల సమక్షంలో.. అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగింది. ఇక అన్ని పుకార్లకు చెక్ పెడుతూ.. మోహన్‌బాబు దగ్గరుండి కుమారుడు మనోజ్ వివాహం జరిపించాడు. నూతన దంపతులను ఆశీర్వదించాడు. మనోజ్ సోదరి మంచు లక్ష్మి నివాసంలో ఈ వివాహం జరిగింది. తమ్ముడి పెళ్లికి సంబంధించి అన్ని ఏర్పాట్లను మంచు లక్ష్మి దగ్గరుండి మరీ చూసుకుంది. పెళ్లి సందర్భంగా మనోజ్‌ని పెళ్లి కుమారుడిని చేసే ఫొటోలు షేర్ చేసింది. ఇక ప్రస్తుతం మనోజ్-మౌనికల పెళ్లికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
మనోజ్-మౌనికల వివాహం శుక్రవారం రాత్రి 8.30 గంటలకు జరిగింది. హైదరాబాద్‌లోని మంచు లక్ష్మి నివాసంలో వీరి వివాహ వేడుకను ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరిగినట్టు సమాచారం. ఇక పెళ్లి బాధ్యతలు తీసుకుని.. దగ్గరుండి అన్ని తానై చూసుకున్న అక్క మంచు లక్ష్మిపై మనోజ్ తన ప్రేమను చాటుకున్నాడు. అక్క తనను పెళ్లి కొడుకును చేస్తోన్న ఫొటోని షేర్ చేసి.. అక్క ఏ జన్మ పుణ్యమో నాది.. లవ్ యూ అక్క.. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ సోషల్ మీడియా వేదికగా అక్కపై అభిమానాన్ని చాటుకున్నాడు మనోజ్. వివాహ తంతు పూర్తయ్యే వరకు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పెద్దగా బయటకు రాలేదు. ఆ తర్వాత ఫొటోలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ప్రస్తుతం మనోజ్ పెళ్లి ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.
ఇక మనోజ్-మౌనికలు ఇద్దరికి ఇది రెండో పెళ్లి అన్న విషయం అందరికి తెలిసిందే. మౌనికా రెడ్డికి ఒక బిడ్డ కూడా ఉన్నాడు. తన కొడుకు ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మౌనికా రెడ్డికి 2015లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త గణేష్‌తో వివాహం జరిగింది. వీరికి ఓ కుమారుడు ధైరవ్ రెడ్డి జన్మించాడు. అయితే, విబేధాల కారణంగా మౌనిక, గణేష్ విడిపోయారు. మరోవైపు, మంచు మనోజ్ కూడా 2015లో ప్రణతి రెడ్డిని వివాహం చేసుకున్నారు. 2015లో వీరి వివాహం జరగగా.. వ్యక్తిగత కారణాలతో 2019లో విడాకులు తీసుకున్నారు. ఆ తరవాత మంచు మనోజ్‌కు మౌనికారెడ్డి దగ్గరయ్యారు. గత కొంతకాలంగా ప్రేమించుకుంటోన్న మనోజ్, మౌనిక.. ఈరోజు వివాహ బంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు అభిమానులు.
And they’re married ✨ @HeroManoj1 & #BhumaMounika are officially Mr & Mrs ❤️ #MWedsM #ManojWedsMounika #ManchuManoj #Tollywood #TollywoodActor #ManchuManojWedding pic.twitter.com/VFdlnc5uGD
— Hyderabad Times (@HydTimes) March 3, 2023